
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే టాలీవుడ్ కి సంబందించిన రెండు బడా హీరోల కుటుంబాల హీరోలు ఈ సినిమా చేయడం తో సినిమా మీద బారి అంచనాలే ఉన్నాయ్, నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగాస్టార్ కుటుంబం నుంచి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది అయితే రాజమౌళి అస్వస్థకు గురయ్యారు అని తెలుస్తుంది. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి చాలా సమయం తీసుకుని ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు గా ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా అజయ్ దేవగన్, సముద్రకని, శ్రేయ లాంటి ఇతర కీలక నటి, నటులు కాంబినేషన్ లో తెరకు ఎక్కినా ఈ సినిమా మీద బారి అంచనాలు ఉన్నాయ్.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకు ఎక్కించారు, తెలుగు, తమిళ్,మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు మరో ఐదు విదేశీ భాషలో కూడా విడుదల అవుతున్న, ఈ సినిమా సంక్రాతి కి విడుదల కానుంది, ఇప్పటికి ఈ సినిమా ప్రమోషన్స్ హాట్ అవుతుంది, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని పోస్టర్లు, పాటలు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. నవంబర్ 26 వ తేదీన ఈ సినిమా నుంచి జనని అనే ఒక పాట విడుదల చేస్తామని గతం లో రాజమౌళి ప్రకటించారు అయితే ఒక రోజు ముందు మీడియా వ్యక్తులకు స్పెషల్ స్క్రీనింగ్ వేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన అదే సమయానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం టిక్కెట్ల రేట్ పెంచడం లేదు అనే వార్త కూడా బయటకి వచ్చింది, ఈ విష్యం మీద టాలీవుడ్ అంట హాట్ టాపిక్ గా మారింది.
స్పెషల్ స్క్రీనింగ్ కారిక్రమానికి హాజరు అయినా రాజమౌళి చాలా డల్ గా కనిపించారు. ఈ టికెట్ రేట్లు తగ్గించి అమ్మితే రికార్డుల పరంగా ఆర్ఆర్ఆర్ సినిమా అనేక కష్టాలు పడే అవకాశం ఉందని ఆ టెన్షన్ తో రాజమౌళి డల్ గా కనిపించారని అనేక రకాల వార్తలు బయటకి వచ్చాయి అయితే తాజాగా ఈ విష్యం మీద రాజమౌళి సన్నిహితుల నుంచి కీలక వివరాలు వెల్లడించారు, గత కొద్దీ రోజులుగా రాజమౌళి వైరల్ జ్వరం తో బాధపడుతున్నారు అని కానీ ప్రమోషన్స్ విష్యం లో ఎక్కడ వెనక్కి తగ్గకూడదు అనే ఉదేశం తో రాజమౌళి జ్వరం తో బాధపడుతూ కూడా ప్రెస్ ప్రీమియర్ కి హాజరు అయ్యారని వెల్లడించారు అయితే సాధారణంగా రాజమౌళి సినిమాలు అయినా లేదా రాజమౌళి ఇచ్చే అప్డేట్ కూడా అభిమానులకు కచ్చితంగా ఆలస్యం అవుతుంది అనే నమ్మకం ఉంటుంది.
అపవాద తొలిగించుకోవడానికి చెప్పిన సమయం కంటే ముందే పాటలు, పోస్టర్లు విడుదల చేయడానికి అనేక తంటాలు పడుతున్నారు అని తెలుస్తుంది, జనవరి 7న విడుదల అవుతున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజమౌళి మూడు రోజులు గా వైరల్ జ్వరం తో బాధపడుతున్నారని దీనితో చాలా బలహీనంగా ఉన్నారని తెలుస్తుంది. జనని పాటను ముందుగా తెలుగు మీడియా కి చూపించాలని అనుకున్నారు కాబట్టి ఈ కారిక్రమానికి హాజరు అయ్యారు. ఒత్తిడికి గురి కావడం లేదా ఏదైనా చేయడం లాంటివి ఎం లేవని వారు స్పష్టం చేసారు. ఇక రాజమౌళి ఎప్పటిలాగా చురుకుగా గా ఉంటూ త్వరగా కోలుకోవాలని అయినా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.