
టాలీవుడ్ లో అపజయం అనేదే ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి..ఈయన ఇప్పటి వరుకు చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసాయి..ఇప్పుడు ఆయన కేవలం టాలీవుడ్ లో మాత్రమే నెంబర్ 1 డైరెక్టర్ కాదు..యావత్తు భారతదేశం లో నెంబర్ 1 డైరెక్టర్..ఆయన పేరు కి ఉన్న బ్రాండ్ వేల్యూ ఇండియా లో ప్రస్తుతం ఏ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అంతటి బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న రాజమౌళి కి మొదటి ఫ్లాప్ రాబోతోందా అనే సందేహాలు ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యాయి..అయితే ఆ ఫ్లాప్ డైరెక్టర్ గా మాత్రం కాదులేండి..నిర్మాతగా అని చెప్పొచ్చు..ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ బడా సూపర్ స్టార్ రణ భీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లు గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర ఈ నెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.
ఈ సినిమా తో రణబీర్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నాడు..తెలుగు వర్షన్ హక్కులను రాజమౌళి కొనుగోలు చేసిన విషయం మన అందరికి తెలిసిందే..రేపు జరగబొయ్యే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు..అయితే బాలీవుడ్ లో లేటెస్ట్ గా సాగుతున్న ఒక ట్రెండ్ ఇప్పుడు బ్రహ్మాస్త్ర మూవీ మేకర్స్ ని భయపడుతుంది..ఇటీవల బాలీవుడ్ ప్రేక్షకులు విడుదలవుతున్న ప్రతి సినిమాని బహిష్కరించాలి అంటూ ట్రెండ్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..వాళ్ళు అలా ట్రెండ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా వాళ్ళు అదే ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు..ఇప్పుడు అది చూసి ఆ చిత్ర దర్శక నిర్మాతలకు భయం పట్టుకుంది..అలియా భట్ అయితే నా సినిమా చూస్తే చూడండి లేకపోతే చూడొద్దు నాకు వచ్చిన నష్టం ఏమి లేదంటూ కాంట్రోవర్సియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..దీనితో ఈ సినిమా పై మరింత నెగటివిటీ పెరిగిపోయింది.
నిర్మాతలు భయపడుతున్నాడు గమనించిన రాజమౌళి కంటెంట్ ఉంటె ఇలాంటివి ఎన్ని వచ్చిన కొట్టుకుపోతాయి..ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించకుండా ఉండరు..నిఖిల్ అనే అబ్బాయి ఎవరో మీ బాలీవుడ్ ప్రేక్షకులకు కానీ చిత్ర పరిశ్రమకి గాని ఎవ్వరికి తెలియదు..కానీ అతని లేటెస్ట్ చిత్రం కార్తికేయ 2 బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారేలా చేసారు..మా తెలుగు ఆడియన్స్ కూడా అంతే..కాబట్టి మన సినిమా కంటెంట్ లో దమ్ము ఉంది భయపడొద్దు అంటూ రాజమౌళి మూవీ మేకర్స్ కి ధైర్యం చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ మరియు మాటలు అందించాడు..విజయేంద్ర ప్రసాద్ గతం లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన భజరంగి భాయ్ జాన్ అనే సినిమాకి విజయేంద్ర వర్మ కథ అందించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా బాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇప్పటికి టాప్ 5 సినిమాలలో ఒకటిగా కొనసాగుతుంది..మరి బ్రహ్మాస్త్ర సినిమా కూడా అదే రేంజ్ లో ఆడుతుందో లేదో చూడాలి.