Home Entertainment రాజమౌళి ఉగ్ర రూపం చూసి షాక్ కి గురి అయినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్

రాజమౌళి ఉగ్ర రూపం చూసి షాక్ కి గురి అయినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్

0 second read
0
0
272

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మల్టీస్టార్ర్ర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమా కోసం అటు నందమూరి మరియు మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో ఈ చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ బిజీ గా ఉన్నది, నిన్న కర్ణాటక ప్రాంతం లోని చిక్ బల్లాపూర్ ప్రాంతం లో లక్షలాది మంది అభిమానుల సమక్షం లో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది,ముఖ్యంగా నిన్న చిత్ర యూనిట్ మొత్తం దివంగత పునీత్ రాజ్ కుమార్ గారిని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక సీఎం తో పాటుగా పునీత్ రాజ్ కుమార్ గారి అన్నయ్య శివరాజ్ కుమార్ గారు కూస్తో ముఖ్య అతిధిగా హాజరు అయినా సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే పునీత్ శివరాజ్ కుమార్ గారు మాట్లాడుతున్న సమయం లో అభిమానుల కేరింతలు ఆకాశాన్ని అంటాయి, అక్కడ ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చెయ్యడం చాలా కష్టం అయ్యిపోయింది,దీనితో రాజమౌళి కి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకొని స్టేజి మీద ఉన్న బాడీ గార్డ్స్ ని కిందకి వెళ్ళమని బిగ్గరగా అరిచాడు, అంతే కాకుండా అప్పటి వరుకు స్టేజి మీద డాన్స్ వేసిన కంటెస్టెంట్స్ ని కూడా ఆయనకిందకి వెళ్లిపొమ్మని గట్టిగా వారించడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు, స్టేజి మీద రాజమౌళి తో పాటు ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కూడా ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు,ఊక ఆ తర్వాత మొత్తం అదుపులోకి రావడం తో ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతంగా కొనసాగింది, నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దాదాపుగా నాలుగు లక్షల మంది హాజరు అయ్యి ఉంటారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం,ఇన్నేళ్ల తెలుగు సినిమా హిస్టరీ లో జరిగిన అత్యంత ఘనమైన ప్రీ రిలీజ్ వేడుకలలో ఇది కూడా ఒక్కటి అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజే ఓపెన్ అయ్యాయి, మఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అధిక టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నాయి , టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే మొత్తం హౌస్ ఫుల్ అవ్వడం ఇటీవల కాలం లో చూసి చాలా కాలం అయ్యింది అనే చెప్పాలి,`ఇక అమెరికా లో అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో నమోదు చేసుకుంటున్నాయి అని చెప్పొచ్చు, ఇప్పటికే కేవలం ప్రీ సేల్స్ నుండి ఈ సినిమా దాదాపుగా 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది అని అంచనా, ఇది ఒక్క ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు, ప్రీమియర్ షోస్ పడే రోజు కి ఈ సినిమా కచ్చితంగా 3 మిలియన్ డాలర్స్ కేవలం ప్రీమియర్స్ నుండే వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక్క అద్భుతమైన రికార్డుగా చెప్పుకోవచ్చు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

చిరంజీవి ఇంట్లో బాలయ్య బాబు సినిమా షూటింగ్..షాక్ లో ఫాన్స్

మన టాలీవుడ్ లో చిరంజీవి మరియు బాలకృష్ణ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా…