
జబర్దస్త్ కామెడీ షో లో స్కిట్స్ వేసుకుంటూ, యూట్యూబ్ లో రివ్యూస్ చెప్పుకుంటూ పాపులారిటీ తెచ్చుకున్న గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 6 లోకి అడుగుపెట్టి ఎంత మంచి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే..హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి గేమ్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన కంటెస్టెంట్స్ లో గీతూ కూడా ఒకరు..తనకి నచ్చిన విధంగా ఆట ఆడుతూ 9 వ వారం వరకు హౌస్ లో కొనసాగింది..టాప్ 5 కంటెస్టెంట్స్ లో కచ్చితంగా ఒకరిగా నిలుస్తుందని అందరూ భావించారు..హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు ఆమె టాప్ 5 అనే అనుకున్నారు..కానీ కథ అడ్డం తిరిగే లోపు గీతూ రాయల్ ఏడ్చిన ఏడుపులు ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు..బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా ఈ విధంగా ఏడ్చినట్టు గతం లో దాఖలాలు లేవు.
ఇప్పటికి కూడా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో బిగ్ బాస్ ని తల్చుకున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటుంది..బిగ్ బాస్ అంటే ఇంత పిచ్చి ఉన్నోళ్లను గతం లో మనం ఎప్పుడూ కూడా చూసుండము..అయితే ఈ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమెకి సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తాయనుకున్నారు..ఎందుకంటే ఈమెలో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది..ఆమె యాస కూడా చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది..సినిమాల్లో అవకాశాలు అయితే బాగానే వస్తున్నాయి కానీ..ఆమె ద్రుష్టి మొత్తం రాజకీయాల పైనే ఉందట..ఇటీవల జరిగిన యూట్యూబ్ లైవ్ ఇంటరాక్షన్ లో తన మనసులోని కోరికని చెప్పుకుంది..ఎప్పటికైనా రూలర్ అవ్వాలనేదే తన కోరిక అని,అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాని చెప్పుకొచ్చింది.
అయితే ఏ పార్టీ లో చేరాలి అనుకునేది ఇంకా డిసైడ్ కాలేదని, త్వరలోనే ఆలోచించుకొని మీకు చెప్తానంటూ అభిమానులకు ఈ సందర్భం గా తెలిపింది గీతూ రాయల్..అయితే ఆమె ఉండేది చిత్తూరు జిల్లా..ఈ ప్రాంతం లో ఎక్కువగా టీడీపీ మరియు వైసీపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది..అందుకే ఈ రెండు పార్టీలలో ఎదో ఒక పార్టీ లో ఆమె చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు..ఇందులో ఏది నిజం అవుతుందో చూడాలి మరి..ప్రస్తుతం అయితే ఈమె చేతిలో ఎలాంటి సినిమా మరియు ఎలాంటి సీరియల్ కూడా లేదు..జబర్దస్త్ లో కూడా ఇక మీదట ఆమె కనిపించడం కష్టమే..మరి అతి కష్టతరమైన ఈ రాజకీయ జీవితం లో గీతూ ఎలా ముందుకు రాగలదో చూడాలి.