
స్టార్ డం సంపాదించుకున్న హీరోలు, హీరోయిన్లపై గాసిప్ లు రావడం సహజం. ఇటీవల మీనా విషయంలో ఇది జరిగింది. మీన రెండో పెళ్లి చేసుకోబోతోందని విపరీతమైన గాసిప్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. పైగా అతను ఇతనే అంటూ కూడా వైరల్ రాయుళ్లు సోషల్ మీడియాలో చాలా గాసిప్ లను క్రియేట్ చేశారు. చివరికి ఆమె వీటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన లేదని, రెండో పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెప్తానని చెప్పి గాసిప్ లపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలాంటివే ఇప్పుడు మరో యంగ్ స్టార్ హీరోయిన్ అంజలి ఎదుర్కొంటుంది.
అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన అంజలి అంతగా రాణించలేదు. దీంతో వెబ్ సిరీస్ వైపు మళ్లింది. రీసెంట్ గా ఆమె చేసిన వెబ్ సిరీజ్ డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ సిరీస్ మాత్రమే పూర్తవగా ఇంకా మరిన్ని సిరీస్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా ‘ఫాల్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది అంజలి. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్ల వైరల్ అవుతున్నాయి.
అంజలి నటించిన ‘ఫాల్’ ప్రమోషన్ లో భాగంగా ఆమె కోలివుడ్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను వివరించింది. కొంత కాలం తాను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని, అయితే అతని పేరు ఇప్పుడు చెప్పడం కుదరదని చెప్పింది. రిలేషన్ షిప్ తాను అనుకున్నంత ఆనందంగా లేదని ఆమె చెప్పుకచ్చారు. కోలీవుడ్ నటుడు జైతో రిలేషన్ షిప్ విషయమై ఆమె స్పందించింది. ఇప్పటి వరకూ తాను ఇండస్ర్టీకి చెందిన ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని ఎక్కడా చెప్పలేదని, తనకు ఇండస్ర్టీలో ఉన్న స్నేహితుల్లో జై కూడా ఒకరని ఆమె స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇప్పటి వరకూ పెళ్లి ప్రస్తావన రాలేదని, అన్ని విధాలుగా గౌరవించే పర్సన్ వస్తే అప్పుడు చేసుకుంటానని చెప్పింది అంజలి. దీంతో అంజలి పెళ్లి, రిలేషన్ షిప్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టయ్యింది.