Home Entertainment రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
380

వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన స్లంప్ పీరియడ్ ని ఎదురుకుంటున్న టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఎంతో ఆశ తో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రామరావు ఆన్ డ్యూటీ’..ట్రైలర్ మరియు పాటలతో మంచి హైప్ ని తెచ్చుకున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..రవితేజ ఫాన్స్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు..ట్రైలర్ చూస్తుంటే రవితేజ ని కాస్త కొత్తగా చూపించినట్టు తెలుస్తుంది..మజిలీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా దివ్యాన్షా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇక సెకండ్ హీరోయిన్ గా రజిష విజయం నటించింది..శరత్ మండవ అనే నూతన దర్శకుడ్ని ఈ చిత్రం ద్వారా పరిచయం చెయ్యబోతున్నాడు రవితేజ..ఇతను ఇస్తున్న ఇంటర్వూస్ లో అతను మాట్లాడే తీరు చూస్తుంటే మంచి విషయం ఉన్నోడే అని అర్థం అవుతుంది..మంచి టైమింగ్ తో కూడిన ఛలోక్తులు చాలానే విసిరాడు..రేపు సినిమా క్లిక్ అయితే ఈ డైరెక్టర్ కి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది..రవితేజ ఇప్పటికే ఇండస్ట్రీ లో ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఎంతో మందిని పరిచయం చేసారు..వారిలో బోయపాటి శ్రీను ,శ్రీను వైట్ల, బాబీ మరియు గోపీచంద్ మలినేని వంటి వారు ఈరోజు ఇండస్ట్రీ లో ఏ స్థాయిలో కొనసాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ షో ని ఇటీవలే కొంతమంది సెలెబ్రిటీల కోసం ప్రసాద్ లాబ్స్ లో వేశారు..అక్కడి నుండి వచ్చిన టాక్ ఎలా ఉందొ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కొత్త రవితేజ ని చూసిన అనుభూతి కలుగుతుంది అట..మాములు రవితేజ సినిమాలలో ఆయన ఎంత ఈజ్ తో మనకి కనిపిస్తాడో..ఈ సినిమా లో మాత్రం చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ తో అలరిస్తాడట..కానీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు వచ్చినప్పుడు మాత్రం ఫాన్స్ వింటేజ్ రవితేజ ని చూస్తారట..ఫాన్స్ కి ఈ సినిమా ఫీస్ట్ లెక్క ఉంటుందట..మంచివో స్టోరీ కథనం తో చాలా కాలం తర్వాత రవితేజ మన ముందుకి వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది..ఇక ప్రముఖ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఎక్కువ కామిక్ పాత్రలు పోషించే వేణు ఈ సినిమా ద్వారా తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట..రవితేజ కి వేణు కి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది..ఇద్దరు పోలీసు అధికారులే..న్యాయం కోసం అవసరమైతే డ్యూటీ లో ఉన్న రూల్స్ ని పక్కన పెట్టి పోరాడే మనిషిగా రవితేజ కనిపిస్తే..రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న రవితేజ కి ఎదురు నిలబడే పాత్రలో వేణు నటించినట్టు తెలుస్తుంది..ప్రివ్యూ టాక్ అయితే అదిరిపోయింది..ఇక రేపు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

రవితేజ గత ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్ కొట్టాడు..కరోనా కారణంగా తీవ్రమైన స్లంప్ పీరియడ్ ని ఎదురుకున్న టాలీవుడ్ కి టానిక్ లాగ నిలిచింది ఈ చిత్రం..కరోనా తర్వాత థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారు అని అందరికి అర్థం అయ్యేలా చేసాడు రవితేజ ఈ సినిమాతో..ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో డీలా పడిన టాలీవుడ్ ని ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా మళ్ళీ ఊపిరి పోస్తాడు అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి..మరి వారి నమ్మకాలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి..టాలీవుడ్ స్లంప్ పీరియడ్ లో ఉండడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 17 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..ఇది రికవరీ చెయ్యగలిగే అమౌంట్ అని చెప్పొచ్చు..టాక్ వస్తే మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది..ఇక ఆపై ఫుల్ రన్ లో అద్భుతమైన లాభాలు రప్పించే సినిమాగా నిలుస్తుంది..ఇదే కనుక జరిగితే ఫుల్ రన్ లో ఈ సినిమా లాభాల వర్షం కురిపిస్తాది..ప్రస్తుతానికి టాలీవుడ్ కి ఇదే కావాలి..మరి బయ్యర్స్ పెట్టుకున్న నమ్మకం ని ఈ సినిమా నిలబెడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…