Home Entertainment రవితేజ ని పట్టించుకోని ‘వాల్తేరు వీరయ్య’ టీం..మండిపడుతున్న అభిమానులు

రవితేజ ని పట్టించుకోని ‘వాల్తేరు వీరయ్య’ టీం..మండిపడుతున్న అభిమానులు

0 second read
0
0
804

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తొలి ఆరు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని 2023లో తొలి హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా విజయంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్ర వహించాడు. సెకండాఫ్‌లో అతడి పాత్ర ప్రేక్షకులకు రిలీఫ్ అనిపించింది. చిరంజీవి సోదరుడిగా క్లైమాక్స్‌లో సెంటిమెంట్ కూడా పండించడం ఈ మూవీకి ప్లస్ పాయింట్‌గా నిలిచింది. విక్రమార్కుడు తర్వాత రవితేజను అంత పవర్‌ఫుల్‌గా చూపించిన చిత్రమిదని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా రవితేజ నటించిన పలు సీన్స్ రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. ఆ రేంజ్‌లో ఆయన ఎమోషన్స్ పండించాడు. ఆయన ఎంట్రీతోనే ఈ చిత్రం పీక్స్‌కి వెళ్ళింది. అయితే సినిమా సక్సెస్ మీట్లలో మాత్రం రవితేజ ఎక్కడ కనిపించడం లేదు. దీంతో వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్‌పై రవితేజ అభిమానులు మండిపడుతున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాకు బజ్ రావడం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజను పిలిచిన వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ సినిమా విడుదలైన తర్వాత పట్టించుకోకపోవడంపై మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఏరు దాటకముందు ఓడ మల్లన్న ఏరు దాటాక బోడిమల్లన్న అన్న తరహాలో రవితేజను వాల్తేరు వీరయ్య టీమ్ చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తున్నారు. తొలుత ఈ మూవీలో రవితేజది అతిథి పాత్ర అని ప్రచారం జరిగింది. కానీ సినిమాలో సగభాగం రవితేజ పాత్ర ఉంటుంది. రవితేజ కూడా ఈ మూవీకి ముందే ధమాకాతో బంపర్ హిట్ కొట్టడంతో వాల్తేరు వీరయ్య సినిమాకు కలిసొచ్చిందని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పూనకాలు లోడింగ్ అనే పాత్రలో చిరుతో కలిసి రవితేజ వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రంలో రవితేజకు భార్యకు కేథరిన్ థెరిస్సా నటించింది. అయితే రవితేజ చనిపోవడం కొంతమందికి నచ్చలేదు.

అటు వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ సన్నివేశంలో రవితేజ పోస్టర్‌పై‌ బురద పడితే చిరంజీవి తన లుంగీతో తుడుచుకుంటూ ఎమోషనల్ అవుతాడు. సో రవితేజ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే ఇంకా బాగుండేదంటూ మెగా అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా త్వారా తెలియజేస్తున్నారు. నిజానికి రవితేజ పాత్రను దర్శకుడు బాబీ పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే రాశాడట. ఆల్రెడీ పవన్‌తో కలిసి పనిచేసిన అనుభవం బాబీకి ఉంది. ఇక చిరుకి ఎలాగూ వీరాభిమాని. పవన్ రాజకీయాల్లో ఉండటంతో ఆయన ఎలాగూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాత్ర చేయలేడు కాబట్టి.. రవితేజ అని బాబీ ఫిక్స్ అయిపోయాడట. చిరు- రవితేజ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో.. పవన్‌ను దృష్టిలో పెట్టుకునే చిరుకి బాబీ సీన్ వివరించేవాడట. అందుకే చిరు – రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు అంత బాగా వచ్చాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేరని అందుకే ఈ పాత్రను రవితేజతో చేయించారన్న టాక్ కూడా నడుస్తోంది. మొత్తానికి వాల్తేరు వీరయ్య విజయంలో చిరంజీవి ఎంత పాత్ర ఉందో రవితేజది కూడా అంతే పాత్ర ఉందని చెప్పడంలో అతియోశక్తి లేదని మాస్ మహారాజా అభిమానులు అంటున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…