
మెగాస్థార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎవ్వరు ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలోపు మెగాస్థార్ చిరంజీవి లో మరియు మెగా అభిమానుల్లో అనందం మామూలు రేంజ్ లో లేదు..రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత వచ్చిన చిరంజీవి సినిమా కావడం తో ఈ మూవీ కి మెగాస్థార్ రేంజ్ కంటే తక్కువ బిజినెస్ జరిగింది..90 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని మాత్రమే జరుపుకున్న ఈ సినిమా కేవలం మొదటి వారం లోనే ఆ డబ్బులను మొత్తం రికవర్ చేసి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది..ఇక ఆ తర్వాత నుండి ఈ సినిమాకి వస్తున్నా డబ్బులు మొత్తం లాభాలే..ఇప్పటికే లాభాల మార్కు 40 కోట్ల రూపాయిలు దాటేసి టాప్ 5 మోస్ట్ ప్రాఫిట్స్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం.
అంత పెద్ద సంచలన విజయం సాధించిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు..అనుకున్న విధంగానే నిన్న వరంగల్ లో సక్సెస్ మీట్ ని సుమారుగా లక్ష మంది అభిమానుల సమక్షం లో జరిపారు..ఈ ఈవెంట్ లో మెగాస్థార్ చిరంజీవి మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదం గా మారాయి..ఈ చిత్రం లో రవితేజ తో తనకి ఉన్న సన్నివేశాల గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘ఇందులో రవితేజ పోస్టర్ కనపడగానే ఆగిపోయాయి అతని పోస్టర్ మీద పడ్డ బురదని నా లుంగీ తో తుడిచి ముద్దు పెడతాను..అదేంటి చిరంజీవి స్థాయి పెద్ద హీరో ఒక చిన్న హీరో కి అలా చెయ్యడం ఏమిటని అందరూ అన్నారు..కానీ రవితేజ ని నేను నా సొంత తమ్ముడిలాగా భావిస్తాను..అందుకే ఆ సన్నివేశాన్ని అంత సహజం గా నటించేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ఇక్క చిరంజీవి తనకంటే చిన్న హీరో అనే పదాన్ని సోషల్ మీడియా లో పచ్చ మీడియా ఒక రేంజ్ లో వైరల్ చేస్తుంది..’రవితేజ ని చిరంజీవి చిన్న హీరో అని అన్నాడు’ అంటూ తెగ ప్రచారం చేస్తుంది..కానీ వాస్తవానికి చిరంజీవి కి ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ ఇష్టం ఉండదు..ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోను..అలాగే హైదరాబాద్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లోను ‘ఈ సినిమాలో రవితేజ లెకపొయ్యుంటే ఇంత అందం వచ్చేది కాదు’ అని ఎన్నో సార్లు చెప్పాడు..ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమి లేదు..ఆయన ఉద్దేశ్యం వయస్సులో తనకంటే చిన్నవాడు అని..దీనిని పచ్చ మీడియా అడ్డదిడ్డం గా వక్రీకరించి చూపించింది..వాస్తవానికి ఈ వర్గపు మీడియా తమ అభిమాన హీరోలకంటే చిరంజీవి నే ఎక్కువ గమనిస్తారు..నాలుగు దశాబ్దాల నుండి మెగాస్థార్ డామినేషన్ అలాంటిది మరి.