Home Entertainment రవితేజ ‘ధమాకా’ ఫుల్ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

రవితేజ ‘ధమాకా’ ఫుల్ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

2 second read
0
0
903

మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లో శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది మాత్రం అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచాడు. అతడు నటించిన కిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్లుగా నిలిచాయి. రవితేజ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అతడి లేటెస్ట్ మూవీ ధమాకా. యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు త్రినాథరావు దర్శకత్వం వహించాడు. ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం పోషించినట్లు టాక్ నడుస్తోంది. ఒక పాత్రలో పక్కా మాస్ లుక్‌లో కనిపించనుండగా.. మరో లుక్‌లో స్టైలిష్ అండ్ క్లాస్‌గా అదరగొట్టనున్నాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల నటించింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం అందుతోంది. దాదాపు రూ. 30 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ. 20 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. క్రాక్ తర్వాత రవితేజ నటించిన పెద్దగా ఆడకపోయినా ఈ మూవీకి ఈ రేటు పలకడం మాములు విషయం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్లు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈనెల 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.

ధమాకా సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా వ్యహరిస్తున్నాడు. కార్తీకేయ2 సినిమాకు కూడా కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా చేసి ప్రశంసలు అందుకున్నాడు. ధమాకా సినిమాకు పాజిటీవ్ టాక్‌ వచ్చిన.. హిట్టు సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఈ సినిమా చూట్టూ పెద్ద వలయమే ఉంది. ధమాకా రిలీజ్‌కు ముందు రోజు విశాల్‌ లాఠీ, నయనతార కనెక్ట్ సినిమాలు విడుదల కానున్నాయి. మరోవైపు ధమాకా రిలీజ్ అవుతున్న రోజే నిఖిల్ నటించిన 18 పేజీస్ కూడా విడుదల అవుతోంది. కార్తికేయ-2 వంటి భారీ విజయం తర్వాత నిఖిల్ నుండి సినిమా వస్తుండటంతో దీనిపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా సుకుమార్‌ కథ అందించడం, గీతా ఆర్ట్స్‌ ప్రొడ్యూస్‌ చేయడం వంటివి ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. దీంతో పాటుగా అదే రోజున రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన సర్కస్‌ మూవీ కూడా రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. ఈ నాలుగు సినిమాలు ఒకెత్తయితే ధమాకా ముందు వారం రిలీజ్‌ కానున్న అవతార్‌-2 మరో ఎత్తు. ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఎఫెక్ట్‌ రెండు మూడు వారాలు ఈజీగా ఉంటుంది. సో రవితేజ ధమాకా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…