
తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అనారోగ్యం తో కన్ను మూసారు, ఈయన చనిపోయి రెండు రోజులు గడిచిన కూడా ఇప్పటికి ఘట్టమనేని అభిమానులు ఆ బాధలో నుంచి బయటకి రాలేకపోతున్నారు కుటుంబ సభ్యులు అయితే షాక్ లోకి వెళ్లిపోయారు కేవలం 56 ఏళ్ల వయసులోనే ఈయన కన్ను మూసారు కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయినా జనవరి 8న తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీనితో ఆయనని కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలి లో ఏఐజి హాస్పిటల్ కి తరలించారు అయితే అప్పటికే రమేష్ బాబు మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర డిబ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, ఈయన అంతక్రియలు మహా ప్రస్థానం లో జనవరి 9న మధ్యాహ్నం ముగిసాయి.
కృష్ణ వారసుడిగా వచ్చిన కూడా ఇండస్ట్రీ లో నిలబడలేకపోయారు రమేష్ బాబు అయితే ఈయన వ్యక్తి గత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియదు ముఖ్యం గా అయినా భార్య పిల్లల గురించి చాలా గోప్యం ఉంచేవాళ్ళు. రమేష్ బాబు భార్య బయటకి కూడా వచ్చింది లేదు ఎప్పుడు అని తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఇంద్ర దేవి ఐదుగురు సంతానం లో రమేష్ బాబు పెద్ద అబ్బాయి, ఆ తరువాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియా దర్శిని అంటే హీరో సుధీర్ బాబు భార్య, ఇక రమేష్ బాబు భార్య పేరు మృదుల ఏ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో అమ్మాయి పేరు భారతి, అబ్బాయి ఓరు జయ కృష్ణ, ఈ పిల్లలు కూడా బయటకి వచ్చింది లేదు ఎప్పుడు కూడా మీడియా ముందు కనిపించింది కూడా లేదు. ఘట్టమనేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా రమేష్ బాబు పిల్లలు ఎన్నడూ ఎక్కువగా కనిపించలేదు.
1977లో, రమేష్ బాబు తన 12వ ఏట తన తండ్రి నిర్మించిన మనుషులు చేసిన దొంగలు సినిమాతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల వయస్సులో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ” నీడ” చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో అతని 4 సంవత్సరాల సోదరుడు, మహేష్ బాబు కూడా ఒక చిన్న పాత్రలో నటించాడు, ఆ తర్వాత అతను నటనకు కొంత విరామం తీసుకున్నాడు. 1987లో అతను వి. మధుసూధన్ రావు దర్శకత్వం లో సామ్రాట్ చిత్రంతో ప్రధాన నటుడిగా తిరిగి వచ్చాడు. అతను జంధ్యాల చిన్ని కృష్ణుడు, ఎ. కోదండరామి రెడ్డి యొక్క బజార్ రౌడీ మరియు తన తండ్రి దర్శకత్వం వహించిన కలియుగ కర్ణుడు మరియు ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలలో కనిపించాడు. ముగ్గురు కొడుకులు అతనితో పాటు అతని తండ్రి మరియు సోదరుడు కూడా నటించారు.
రమేష్ బాబు సినిమాలకు దూరం అయినా తరువాత మీడియా ముందు కనిపించడం కూడా మానేసాడు పైగా ఈయన వేశాలలకు అలవాటు పడిపోయినట్లు గా తెలుస్తుంది. అదే అయినా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది అని అయినా స్నేహితులు చెబుతుంటారు. పూర్తిగా ఫ్యసిక్ మారిపోయి ముసలివాడిలా అయిపోవడంతో రమేష్ బాబు బయట కనిపించేవారు కాదు, ఆ మధ్య ఒక్కసారి మాత్రం కుమారుడు జయ కృష్ణ ధోతు ఫంక్షన్ లో తప్పించి బయట ఎక్కడ కనిపించలేదు, అపుడే రమేష్ బాబు ని చూసి అంత షాక్ అయిపోయారు, ఇలా అయిపోయారు ఏంటి అని ఒక్కపుడు ఎంత అందంగా ఉండేవాడు ఇపుడు ఏంటి ఇలా అయిపోయాడు అంటూ ఘట్టమనేని అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇపుడు రమేష్ బాబు మరణం పై సినీ ఇండస్ట్రీ అంత షాక్ అయ్యారు. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.