
రజనీకాంత్ కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదనిపిస్తుంది. పెటా, దర్బార్ ఆశించినంత మేర ఆడలేదు. దీంతో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ లో ప్రాజెక్టులను ఎన్నుకోవడం కూడా ఆయనకు ఒక సవాలనే చెప్పకతప్పదు. విలన్ గా తమిళ్ ఇండస్ర్టీలో అడుగుపెట్టిన శివాజీ రావు గైక్వాడ్ (రజనీ కాంత్). తర్వాత కో ఆర్టిస్టుగా, తర్వాత హీరోగా ఇప్పుడ తలైవాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అన్ని విభాగాల్లో తన సత్తా చాటారు రజనీకాంత్. కానీ ఈ మధ్య ఆయన వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన కాలం కోసం ఎదురుచూడడం తప్ప చేసేది లేదనిపిస్తోంది.
ఇటీవల రీ-రిలీజ్ ఎక్కువగా కొనసాగుతుంది. చాలా మూవీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఒక్కోసారి వాటికున్న గొప్పతనాన్ని గ్రహించిన ప్రేక్షకులు వాటిని రీ రిలీజ్ లో బాక్సాఫీస్ హిట్లను కూడా కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ కాంత్ కూడా ఒక మూవీని ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఆధ్యాత్మిక భావజాలం ఉన్న రజనీకాంత్ కు చాలా ఏళ్లుగా ఒక ప్రాజెక్టును తెరకెక్కించాలనుకున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేసి ‘బాబా’ను స్ర్కీన్ పైకి తెచ్చారు. అయితే ఆ మూవీ కాస్త డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో ఆయన చాలా వరకు డీప్రెషన్ కు గురయ్యారు. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ తీసిన సినిమాలు చాలానే బాక్సాఫీస్ హిట్ కొట్టాయి. ఇక్కడ ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకున్నామంటే.. రజనీకాంత్ రీ రిలీజ్ మూవీ ‘బాబా’ కలెక్షన్ల కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ మూవీ దరిదాపుల్లోకి కూడా రాలేదు.
టాలీవుడ్ లో ఫస్ట్ రీ రిలీజ్ మూవీ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’. ఇది మొదట్లో ఆడలేకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షో వేసుకున్నారు. ఇది తెలుగు ఇండస్ర్టీలోనే ఒక చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా 750 షోస్ వేయగా రూ.3.30 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇది ఆల్ టైం రికార్డుగా నిలిచింది. తర్వాత మహేశ్ బాబు నటించిన ‘పోకిరీ’ని కూడా ఆయన ఫ్యాన్స్ 4K కు మార్చి మరీ రీ రిలీజ్ చేయించుకున్నారు. ఇది అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. కోటి, 75 లక్షలను కలెక్ట్ చేసింది. రజనీకాంత్ బాబా సినిమా కూడా డిసెంబర్ 10న రీ రిలీజ్ చేశారు. చాలా థియేటర్లలో బాబా షోస్ వేశారు. ఒక్క చెన్నై పట్ణంలోనే 100 షోస్ వేయించుకున్నారు ఫ్యాన్. అయినా పవన్ కళ్యాణ్ జల్సా కలెక్షన్లతో పోలిస్తే దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. రజనీకాంత్ బాబా సినిమా రిలీజ్ డేట్ నుంచి ఇప్పటి వరకూ కన్నడ ప్రాంతంలో రూ. 8లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియలో రూ. 5లక్షలు, మొత్తం ఇండియా వైజ్ గా రూ. 93లక్షలు కలెక్ట్ చేసింది. అయితే ఇంకో వారం రోజులుగా ఆడినా ‘జల్సా’ దరిదాపుల్లోకి కూడా రావడం అసాధ్యమని విశ్లేషకులు చెప్తున్నారు.