Home Entertainment ‘రంగ రంగ వైభవంగా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..మెగా అల్లుడికి మరో చావు దెబ్బ

‘రంగ రంగ వైభవంగా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..మెగా అల్లుడికి మరో చావు దెబ్బ

0 second read
0
0
221

గతం లో ఒక ఫ్లాప్ సినిమాకి కనీసం వారం రోజులు షేర్స్ వచ్చేవి..నిర్మాతకి ఎంత పెద్ద ఫ్లాపయినా ఒక 50 శాతం వరుకు రికవరీ చేసేవి..కానీ కరోనా తర్వాత ఇండస్ట్రీ లో పెను మార్పులు సంభవించాయి..సినిమా బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు..అదే యావరేజ్ టాక్ లేదా ఫ్లాప్ టాక్ వస్తే కనీసం థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు..దానికి ప్రధాన కారణం లాక్ డౌన్ సమయం లో ప్రేక్షకులు OTT కి బాగా అలవాటు పడడమే..మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలే ఈ ఏడాది ఫ్లాప్ టాక్ వస్తే బాక్స్ ఆఫిస్ వద్ద ఘోరమైన ఫలితాలను చూడడం మనం గమనించాము..ఇక మీడియం రేంజ్ హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కనీసం డబుల్ డిజిట్ షేర్స్ ని కూడా దక్కించుకోలేక పోతున్నారు..ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయాడు మెగా ఫామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్..తొలి సినిమా ఉప్పెన తోనే ఓపెనింగ్ నుండి క్లోసింగ్ వరుకు శబాష్ అనిపించుకున్నాడు..కానీ ఆ తర్వాత విడుదలైన కొండపోలం అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇక ఆ తర్వాత ఇటీవలే వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొట్టేసింది..విడుదలకి ముందు నుండే ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పాటు అయ్యింది..అద్భుతమైన టీజర్ మరియు ట్రైలర్ కట్స్ తో ప్రేక్షకులలో మంచి అంచనాలను అయితే ఏర్పాటు చెయ్యగలిగింది..కానీ విడుదల తర్వాత మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది..దాని ఫలితం ఈ సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాకపోడమే..అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో అనే సంగతి కనీసం మెగా ఫాన్స్ కి కూడా తెలియదు..అలాంటి పరిస్థితి ఏర్పడింది..ఇప్పటి వరుకు ఈ సినిమాకి కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే దక్కింది..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని కూడా దక్కించుకునేలా కనిపించడం లేదు.

దీనితో మెగా కుర్రాడి డబుల్ డిజాస్టర్ ఫ్లాప్ తగినట్టు అయ్యింది..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో తీవ్రమైన సంక్షోభం లో పడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని భింబిసారా మరియు సీతారామం వంటి సినిమాలు కాపాడాయి..ఇక ఆ తర్వాత వచ్చిన కార్తికేయ 2 అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..అలా మంచి ఊపుతో వెళ్తున్న టాలీవుడ్ కి లైగర్ సినిమా రూపం లో చావు దెబ్బ తగిలింది..ఈ సినిమా తర్వాత వెంటనే టాలీవుడ్ కి రంగ రంగ వైభవంగా మరియు ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్ తో మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది..ఈ సమయంలోనే దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటున్నారు..ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన జల్సా సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..రికార్డు స్థాయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో లైగర్ చేసిన గాయాన్ని పూడ్చే ప్రయత్నం చేసింది..కానీ ఆ సినిమా కేవలం ఒక్క రోజు ప్రదర్శించుకోడానికే అనుమతి..ఇప్పుడు టాలీవుడ్ కి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం ఎంతైనా ఉంది..చూడాలి మరి టాలీవుడ్ ని మళ్ళీ ఎవరు ఆదుకుంటారో.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…