
తెలుగు ప్రజలకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్లుగా సుమ తన యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సుమ యాంకరింగ్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. అందుకే టెలివిజన్ తెరపైకి ఎంత మంది యాంకర్లు వచ్చినా ఇప్పటికీ టాలీవుడ్ యాంకర్లలో సుమనే టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఎలాంటి షో అయినా సరే ఆమె మాటల ప్రవాహంతో దాన్ని ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకెళ్తుంది. ఆమె సమయస్ఫూర్తికి, చలాకీతనానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఇటు బుల్లి తెర మీద అగ్ర యాంకర్‌గా రాణిస్తూనే ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది. అయితే తాజా సుమ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుమ స్వయంగా వెల్లడించడంతో ప్రేక్షకులందరూ షాక్‌కు గురవుతున్నారు.
తాను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సుమ తెలిపింది. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్నేళ్ల పాటు తాను ఎన్నో కష్టాలు పడినట్లు సుమ వివరించింది. ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకున్న ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో ముఖానికి ఎలా మేకప్ వేసుకోవాలో తనకు తెలిసేది కాదని.. అంతేకాకుండా వేసుకున్న మేకప్‌ను ఎలా తీసేయాలి అన్న విషయం కూడా తెలియక ఈ డ్యామేజ్ జరిగిపోయిందని సుమ చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశానని సుమ తెలిపింది.చర్మ సమస్య కారణంగా ఏదైనా గాయమైతే అది త్వరగా తగ్గిపోదని, ఆ గాయం మరింత పెద్దదిగా అవుతుందని వివరించింది. తనకు వచ్చిన ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా ట్రై చేసినట్లు సుమ వెల్లడించింది.
ఇప్పుడు ఈ వ్యాధి తన శరీరంలో భాగంగా మారిపోయిందని.. ఇప్పుడు ఉన్న తన చర్మ అందాన్ని కాపాడుకోవడం తప్ప చేసేదేమీలేదని సుమ అసహనం వ్యక్తం చేసింది. శరీరంలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాన్ని దాచిపెడతామని. కానీ అది మన శరీరంలోనే ఉంటుందని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలని సుమ వేదాంతం చెప్పింది. కాగా సుమ ఇటీవల వెండితెరపైనా నటించింది. జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో దేవీప్రసాద్ భార్యగా నటించి కట్నకానుకలపై పంచాయతీకి వెళ్తుంది. ఈ సినిమాలో సుమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలుత సినీ నటిగా కళాజీవితం మొదలుపెట్టిన సుమకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక ఇబ్బందులకు గురైంది. అనంతరం యాంకరింగ్‌పై పట్టు సాధించి ఇప్పుడు కొన్నేళ్లుగా టాప్ యాంకర్‌గా చలామణి అవుతోంది. భర్త రాజీవ్ కనకాల నుంచి ఆమెకు ఉండే ప్రోత్సాహం, సినిమా పరిశ్రమలో ఆమెకు ఉండే పరిచయాలు అన్నీ కూడా సుమకు బాగా కలిసి వచ్చాయనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.