Home Entertainment యాంకర్ వర్షిణి తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్..ముహూర్తం ఎప్పుడో తెలుసా?

యాంకర్ వర్షిణి తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్..ముహూర్తం ఎప్పుడో తెలుసా?

0 second read
0
0
6,915

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతో పాపులర్ కమెడియన్‌గా మారిన ఆది సినిమా అవకాశాలను కూడా సంపాదిస్తున్నాడు. బుల్లితెరపై పటాసుల తరహాలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం హైపర్ ఆది నైజం. మాట మాటకు పంచ్ విసురుతూ కామెడీ చేయడంలో దిట్ట కూడా. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు అదిరిపోయే సెటైర్లతో హైపర్ ఆది హంగామా చేస్తుంటాడు. ప్రతి స్కిట్స్‌లో కూడా కావాలనే లవ్, మ్యారేజ్ లాంటి అంశాలని జొప్పిస్తూ ఆకర్షిస్తుంటాడు. అలా హైపర్ ఆది చేసిన ఎన్నో రొమాంటిక్ స్కిట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా కూడా హైపర్ ఆది తన కామెడీని పంచుతున్నాడు. లేడీ యాంకర్లతో హైపర్ ఆది రిలేషన్ షిప్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అనసూయ, రష్మీలతో హైపర్ ఆది చాలా క్లోజ్‌గా ఉంటాడు. వాళ్లపై సెటైర్ల వేస్తూ కడుపుబ్బా నవ్విసాడు.

అలాగే యాంకర్ వర్షిణితోనూ హైపర్ ఆది చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఇటీవల హైపర్ ఆది బర్త్ డే రోజు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యాంకర్ వర్షిణి పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోకు యాంకర్ వర్షిణి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆదితో పాటు బర్త్డ్ డే వేడుకల్లో పాల్గొన్న యాంకర్ వర్షిణి ‘పుట్టినరోజు వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. డియర్ ఆది నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తివి నువ్వు. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచే స్నేహితుడు’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోలో హైపర్ ఆదిని యాంకర్ వర్షిణి కౌగిలించుకోవడం కూడా రొమాంటిక్‌గా కనిపిస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

హైపర్ ఆదిపై ఉన్న ఇష్టాన్ని ఇంత ఓపెన్‌గా యాంకర్ వర్షిణి చెప్పడం చూసి ఈ ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే కామెంట్లు షురూ అయ్యాయి. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు. వీళ్ల పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఒకవైపు సినిమాలు.. మ‌రో వైపు బుల్లి తెర‌పై ప్రేక్ష‌కులను న‌వ్విస్తూ గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది త్వరలో ఓ ఇంటివాడు కావడం ఖాయమని తెలుస్తోందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే హైపర్ ఆది త‌న దూకుడు స్వ‌భావ‌ం వల్ల కొన్ని వివాదాలను కూడా కొనితెచ్చుకుంటున్నాడు. త‌న స్కిట్స్ వ‌ల్ల అందులో వేసే పంచ్‌ల కార‌ణంగా హైప‌ర్ ఆది ప‌లు వివాదాల‌కు కేరాఫ్‌గా మారిన స‌మ‌యాలు కూడా ఉన్నాయి. రీసెంట్‌గా హైప‌ర్ ఆది ఓ స్కిట్ వేశాడు. అందులో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన వైసీపీని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్‌గా అందులో పంచ్‌లు వేశాడు. వీడియోను గ‌మనిస్తే స్కిట్‌లోని ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో మీదే పార్టీ అన‌గానే మేం ఉన్నాం అని ఒక‌రు.. మేం విన్నాం అని మ‌రొక‌రు అంటారు. దానికి బ‌దులుగా ఆది మేముంటాం అంటూ కౌంట‌ర్ ఇస్తాడు. దీంతో వైసీపీ అభిమానులు హైపర్ ఆదిని ట్రోల్ చేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…