
తెలుగు బుల్లితెర పై మెగాస్టార్ రేంజ్ ఇమేజి ఉన్న యాంకర్ ఎవరు అంటే ముక్తకంఠం తో ప్రతి ప్రేక్షకుడు చెప్పే పేరు సుమ..గత కొన్ని దశాబ్దాల నుండి ఈమె బుల్లితెర సామ్రాజ్యాన్ని ఏలుతునే ఉంది..ఈమె తర్వాత ఇండస్ట్రీ కి ఎంత మంది యాంకర్స్ వచ్చినా కూడా ఈమె స్థానాన్ని మాత్రం ఒక్కరు కూడా భర్తీ చేయలేకపోయారు..ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సహా ఇప్పటికి అన్నీ సుమ కవర్ చేస్తూనే ఉంది..చిన్న హీరోల సినిమా దగ్గర నుండి పెద్ద హీరోల సినిమాల వరకు ప్రతీ ఈవెంట్ కి సుమ ఉండాల్సిందే..సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు..ఆ రేంజ్ ఆమె మేనియా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది..ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను సుమ దాదాపుగా పది లక్షల రూపాయిల వరకు పారితోషికం తీసుకుంటుంది..ఒక్కమాటలో చెప్పాలంటే తన భర్త రాజీవ్ కనకాల కంటే సుమ సంపాదన పది రేట్లు ఎక్కువ.
అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే సుమ ఇక నుండి యాంకర్ జీవితానికి టాటా చెప్పబోతుందా..ఇక నుండి ఆమెని యాంకర్ గా మనం చూడలేమా వంటి వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్నాయి..సుమ కి షూటింగ్ లో ఉండే లైట్స్ వల్ల స్కిన్ కి సంబంధిత వ్యాధితో చాలా కాలం నుండి బాధపడుతుందట..ఇందుకోసం ఆమె శస్త్ర చికిత్స కూడా గత కొంత కాలం నుండి తీసుకుంటుంది..అయితే ఇప్పటికి కూడా ఎలాంటి మెరుగైన ఫలితం రాకపోవడం తో కొంతకాలం విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారట..దీనితో ఆమె కొంత కాలం తన కెరీర్ కి విరామం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
కెరీర్ పీక్ స్థానం లో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె యాంకర్ కెరీర్ రిస్క్ లో పడుతుందా..లేదా మునుపటి లాగానే ఆమె కెరీర్ జెట్ స్పీడ్ లో వెళ్తుందా అనేది చూడాలి..ఒకవేళ సుమ యాంకర్ కెరీర్ ని పూర్తి గా పక్కన పెడితే మాత్రం టాలీవుడ్ కి అతి పెద్ద నష్టం అనే చెప్పాలి..ఎందుకంటే ఆమె స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చెయ్యలేరు..ఇండస్ట్రీ లో చాలా మంది యాంకర్స్ ఉన్నారు కానీ సుమా ని మ్యాచ్ చెయ్యడం మాత్రం కష్టం..కేవలం ఆమె కోసమే షోస్ ని చూసే వాళ్ళు..ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చూసే వాళ్ళు ఉంటారు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు..ఆమె పంచె ఎంటర్టైన్మెంట్..వేసే జోక్స్ అలాంటివి మరి.