Home Entertainment యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

2 second read
0
0
14,801

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా కి వస్తున్నా రికార్డ్స్ చూస్తుంటే నెక్స్ట్ ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తియ్యబోయ్యే సలార్ సినిమా ఇంకా ఎన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రాధే శ్యామ్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో గాయపడిన సింహాలు లాగ ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు సలార్ ఊర మాస్ సినిమా వస్తే వారి ఆకలికి ఈ సినిమా 2000 కోట్ల రూపాయిలు కొల్లగొట్టినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ కి అభిమానుల నుండి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది..అందులోనూ ప్రభాస్ ఒక్క ఊర మాస్ సినిమా చేసి ఏళ్ళు గడిచాయి..మిర్చి సినిమా తర్వాత ఆయన చేస్తున్న ఒక్క ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ ఇదే..దీనితో ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలేవేషన్ సీన్స్ కి ప్రభాస్ ని ఊహిస్తుంటే మాములు ఆడియన్స్ కే మతి పోతుంది..ఇక ప్రభాస్ ఫాన్స్ కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఒక్క వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానులను అనందం తో గెంతులు వేసేలా చేస్తోంది..అదేమిటి అంటే సలార్ సినిమా ఇప్పటికే 30 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భం గా ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట ప్రశాంత్ నీల్..ఈ టీజర్ యూట్యూబ్ తో పాటుగా ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో జత పర్చబోతున్నారు అట..వాస్తవానికి ఈ సినిమా టీజర్ ని KGF చాప్టర్ 2 సినిమాతోనే జత చేసి విడుదల చేద్దాం అనుకున్నారు అట..కానీ అప్పటికే టీజర్ ని కట్ చెయ్యడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టడం తో విడుదల చేయలేకపోయారు అట..ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఆత్రుత తో ఎదురు చూసే విధంగా అద్భుతంగా కట్ చేసారు అట ఈ టీజర్ ని..KGF కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన రవి బాసృర్ గారే ఈ సినిమాకి కూడా పని చేస్తున్నారు అట..టీజర్ కట్ కి కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించినట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో శృతి హస్సన్ హీరోయిన్ గా నటిస్టున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈమధ్య కాలం లో ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి..దానికి నిదర్శనమే క్రాక్ మరియు వకీల్ సాబ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ ఫలితాలు..సినిమాల పాలిట గోల్డెన్ లెగ్ గా మారిన శృతి హాసన్ ఉండడం వల్ల సలార్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..ఈ ఏడాది లోపు ఈ సినిమా షూటింగ్ ని మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీ వారి అంచనాలను ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి..ప్రభాస్ ఈ సినిమా తో పాటుగా ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ కే వంటి సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాల పైన కూడా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…