
మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, ఎలాంటి విపత్తు ఎదురు అయినా ప్రతి ఒక్కరికి అండగా నిలబడే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి, సినిమా హీరోగా ఎవ్వరికి అందనంత ఎత్తుకి ఎదిగిన కూడా ఎక్కడ కూడా అహం భావం చూపని మంచి మనిషి ఆయన, దానికి ఉదాహరణే ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న టికెట్ రేట్స్ సమస్య ని పరిష్కరించడం, ఇండస్ట్రీ బాగోగులు కోసం తన స్థాయిని సైతం మర్చిపొయ్యి చేతులు జోడించి ముఖ్యమంత్రి జగన్ ని వేడుకోవడం ప్రతి ఒక్కరి చేత కంట తడి పెట్టేలా చేసింది, ముఖ్యమంత్రి తో చిరంజీవి చర్చలు జరుపుతునంత సేపు ఆయనలో సమస్య ని పరిష్కరించాలి అనే తపనని ప్రతి ఒక్కరు గమనించారు, అందుకే ఈరోజు టాలీవుడ్ మొత్తం ఆయనని ప్రశంసలతో ముంచి ఎత్తుతుంది, ఇటీవల కాలం లో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే దాని పై విపరీతంగా చర్చలు కొనసాగుతున్నాయి, మా ఎన్నికల సమయం లో మోహన్ బాబు తానె ఇండస్ట్రీ పెద్ద అంటూ తన తోటి భజన బృందం తో ఎలా భజన చేయించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ సమస్య వచ్చినప్పుడు నాకు ఎందుకులే అన్నట్టు వ్యవహరించి సమస్య ఒక్కరి వాళ్ళ పరిష్కారం అయినా తర్వాత తానే ఆ సమస్యని పరిష్కారం చేయించాను అంటూ దిగజారి ఇటీవల చేసిన ఒక్క చర్య ఆయనని నవ్వులపాలు అయ్యేలా చేసింది.
ఒక్క మంత్రి ఇంట్లో పెళ్లి ఫంక్షన్ కి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రాఫర్ పేర్ని నాని ని ఇంటికి కాఫీ కి పిలిచి ఆయనతో ఫోటో దిగి,తన వల్లే ఇండస్ట్రీ లో టికెట్ సమస్యలు మొత్తం పరిష్కారం అయినట్టు ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక్క ట్వీట్ వేసాడు మంచి విష్ణు వర్ధన్ బాబు, ఆ తర్వాత మంత్రి నాని ఏమిటి మీరు చేసింది అంటూ మంచు విష్ణు కి ఫోన్ చేసి తిట్టడం తో ఆ ట్వీట్ ని వెంటనే తొలగించి మల్లి మాములుగా ట్వీట్ వేసాడు, మోహన్ బాబు మరియు మంచుకి విష్ణు చేస్తున్న ఈ పనులు చూసి వారిఇద్దరు చుట్టూ ఉండేవాళ్ళు కూడా పెదవి విరుస్తున్నారు, కరోనా సమయం లో కానీ ఇండస్ట్రీ లో మరే సమస్య వచ్చినప్పుడు కానీ మోహన్ బాబు ఎప్పుడు కూడా చొరవ తీసుకొని ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపింది లేదు, ఎప్పుడు చూసిన తన గురించి తానూ డబ్బాలు కొట్టుకోడం తప్ప వాస్తవానికి ఈయన ఇండస్ట్రీ కోసం పీకింది ఏమి లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో కొంతమంది పెద్దలు చెప్పుకుంటున్నారు, ఇండస్ట్రీ పెద్ద అంటే మాటల్లో చెప్పుకోవడం కాదు , చేతల్లో చేసి చూపించేది, దానికి ఉదాహరణే మెగాస్టార్ చిరంజీవి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.
ఇక ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయిపోయిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చిరంజీవి ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఇప్పటికి వైరల్ గా తిరుగుతూనే ఉంది, ఆయన మాట్లాడుతూ ‘ చిరంజీవి గారికి కొంతమంది లాగ ఇండస్ట్రీ పెద్దని అని చెప్పుకోవడం ఇష్టం ఉండదు,కానీ ఆయన చేసే పనులే ఆయనకీ ఇండస్ట్రీ లో ఎలాంటి స్థానం ఉన్నదో, ముఖ్యమంత్రులు సైతం ఆయన మాటలకు ఎలాంటి గౌరవం ఇస్తారో అనే దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనేది, ఎన్నో నెలల నుండి ఏంటో జటిలంగా మారిన ఈ సమస్య కి నేడు పరిష్కారం దారికేలా చేసిన చిరంజీవి గారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ రాజమౌళి ఇచ్చిన స్పీచ్ మోహన్ బాబు కి ఎక్కడో కాలినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ, వాస్తవానికి చిరంజీవి కి మోహన్ బాబు కి అసలు పోలికే లేదు, ఎందుకంటే చిరంజీవి సినిమా మొదటి రోజు ఒక్క ఆట కి వచ్చేంత కలెక్షన్స్ లో పావు శాతం కూడా మోహన్ బాబు కుటుంబానికి ఫుల్ రన్ లో కూడా రాదు, అలాంటి శిఖరాగ్ర స్థాయిలో ఉన్న చిరంజీవి కి మోహన్ బాబు తో పోల్చడమా అంటూ మెగా ఫాన్స్ సోషల్ మీడియా లో నవ్వుకుంటున్నారు.