Home Entertainment మొదటి వారం వసూళ్ళలో ఎవరిదీ పై చెయ్యి?? సర్కారు వారి పాట ఎంత వసూలు చేసింది?

మొదటి వారం వసూళ్ళలో ఎవరిదీ పై చెయ్యి?? సర్కారు వారి పాట ఎంత వసూలు చేసింది?

0 second read
0
1
401

మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కి మధ్య ఎలాంటి పోటీ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్కప్పుడు చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య ఎలాంటి బాక్స్ ఆఫీస్ వార్ ఉండదో..ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య కూడా అలాంటి బాక్స్ ఆఫీస్ వార్ ఉంది..ఇటీవలే వీళ్లిద్దరు హీరోలు గా నటించిన భీమ్లా నాయక్ మరియు సర్కారు వారి పాట సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..భీమ్లా నాయక్ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో కుట్ర పూర్తిహ రాజకీయాల వల్ల అతి తక్కువ టికెట్ రేట్స్ ఉన్నాయి..అంతే కాకుండా ఈ సినిమాకి బెన్ఫిట్ షోస్ కూడా లేవు..ఈ రెండు కలెక్షన్స్ మీద చాలా గట్టి ప్రభావం చూపిస్తుంది అనే విషయం మన అందరికి తెలిసిందే..కానీ సర్కారు వారి పాట సినిమా కి టికెట్ రేట్స్ తో పాటుగా బెన్ఫిట్ షోస్ వేసుకోవడానికి కూడా అనుమతిని ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం..అయితే టికెట్ రేట్స్ విషయం లో ఇంత వ్యత్యాసం ఉన్న ఈ రెండు సినిమాలకి మొదటి వారం వసూళ్ల మధ్య ఎంత తేడా ఉన్నదో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ముందుగా భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే..ఇటీవల కాలం బంపర్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమా ఏదైనా ఉండ అంటే అది భీమ్లా నాయక్ అనే చెప్పొచ్చు..భారీ హైప్ తో విడుదల అయినా ఈ సినిమా టికెట్ రేట్స్ లేకపోయినప్పటికీ కూడా మొదటి రోజు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 27 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక నైజం ప్రాంతం లో అయితే ఈ సియోనిమా ఏకంగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది..సర్కారు వారి పాట చిత్రం మొదటి రోజు నైజం ప్రాంతం లో భీమ్లా నాయక్ కంటే 50 రూపాయిల అధిక టికెట్ రేట్స్ తో విడుదల అయ్యింది, కానీ మొదటి రోజు కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే దక్కించుకుంది..ఇక మొదటి వీకెండ్ లో సర్కారు వారి పాట సినిమాకి భీమ్లా నాయక్ సినిమాకంటే అత్యధిక వసూళ్లు వచ్చాయి..భీమ్లా నాయక్ సినిమాకి మొదటి మూడు రోజులు 70 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేస్తే, సర్కారు వారి పాట సినిమా 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది.

లాంగ్ వీకెండ్ తర్వాత సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా స్లో అయ్యినప్పటికీ కూడా స్టడీ కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోయింది..మొదటి వారం భీమ్లా నాయక్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తే, సర్కారు వారు పాట సినిమా కేవలం 85 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..భీమ్లా నాయక్ కంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక రేట్స్ మరియు షోస్ ఉన్నప్పటికీ కూడా తక్కువ వసూళ్లు రావడానికి కారణం, మితిమీరిన టికెట్ రేట్స్ వల్లే అని ట్రేడ్ వర్గాల అంచనా..OTT రాజ్యం ఏలుతున్న సమయం లో ఒక్క సినిమాకి ఈ స్థాయి రేట్స్ ఉంటె టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయి అని ట్రేడ్ పండితుల వాదన..నిర్మాతలు అత్యాశకి పొయ్యి ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచేసి సినిమాల థియేట్రికల్ రన్ కి బొక్క పెడుతున్నారు అని ట్రేడ్ పండితుల నుండి వస్తున్నా ఆరోపణ..ఇక నుండి అయినా టికెట్ రేట్స్ సామాన్యుడికి అందుబాటులో ఉండేట్టు పెడుతారో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…