Home Movie News మొదటి వారం లో బిగ్ బాస్ 4 నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో తెలిసిపోయింది

మొదటి వారం లో బిగ్ బాస్ 4 నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో తెలిసిపోయింది

0 second read
0
0
3,342

కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీసన్ 4 ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయినా సంగతి మన అందరికి తెలిసిందే.బిగ్ బాస్ సీసన్ 3 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున సీసన్ 4 కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.ఈ సీసన్ ప్రారంభం అయినా తొలి రోజే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపింది.టెలికాస్ట్ అయినా తొలి ఎపిసోడ్ కి ఎవ్వరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో టీ ఆర్ పీ రేటింగ్స్ ని కైవసం చేసుకున్న ఈ షో ప్రతి రోజు రాత్రి 9 :30 గంటలకు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతుంది.ఇది ఇలా ఉండగా అప్పుడే ఈ సీసన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని బయటకి పంపేందుకు నామినేషన్స్ ప్రక్రియ కూడా జరిగిపోయింది.మరి ఈ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో,జరిగిన నామినేషన్స్ నుండి ప్రేక్షకుల వేసిన ఓట్లు ద్వారా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మేము ఎక్సక్లూసివ్ గా ఆ వివరాలని మీకు ఈ కథనం ద్వారా అందించబోతున్నాము.


మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉన్న ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినెటే అయినా ఇంటి సభ్యులు ఎవరు అంటే గంగ అవ్వ తో పాటు అభిజిత్ మరియు సూర్యకిరణ్ ,దివి ,మెహబూబ్ మరియు సుజాత ఈ వారం ఇంటి నుండి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు.వీరిలో గంగ అవ్వ కి రికార్డు స్థాయి ఓట్లు నమోదు అవుతున్నట్టు సమాచారం.ఆమె తర్వాత స్తానం లో నిలిచినా మరో కంటెస్టెంట్ అభిజిత్.వీళ్లిద్దరి తర్వాత ఎక్కువ శాతం ఓట్లతో ముందుకి దూసుకుపోతున్న మరో కంటెస్టెంట్ మెహబూబ్.ఇక సుజాత మరియు దివి కి ఒక్కే స్థాయి ఓట్లతో ముందుకి దూసుకుపోతున్నారు.అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ సూర్య కిరణ్ అని తెలుస్తోంది.మిగిలిన అందరూ కంటెస్టెంట్స్ కి సోషల్ మీడియా లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉండడం ,వాళ్లతో పోలిస్తే సూర్య కిరణ్ కి చాల తక్కువ ఫాలోయింగ్ ఉండడం వల్ల ప్రస్తుతం ఆయన డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా సూర్య కిరణ్ తోలి రోజు కోనెటస్టెంట్స్ తో ప్రవర్తించిన తీరు కూడా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు అనే విషయం అర్థం అవుతుంది.సూర్య కిరణ్ గతం లో అక్కినేని సుమంత్ హీరో గా తెరకెక్కిన సత్యం సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి సుమంత్ కెరీర్ లో మొట్టమొదటి హిట్ గా నిలిచింది.ఆ తర్వాత సూర్య కిరణ్ అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కళ్యాణి ని ప్రేమించి పెళ్లాడాడు.కెరీర్ లో ఎన్నో హిట్లు మరియు ప్లాపులు చూసిన సూర్య కిరణ్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఒక్క కంటెస్టెంట్ గా వచ్చాడు.తోలి రోజు ఆయన పట్ల మిశ్రమ స్పందన లభించిన రాబొయ్యే రోజుల్లో ప్రేక్షకుల నుండి మంచి అభిప్రాయం వచ్చే అవకాశం అయితే ఉంది.అయితే ప్రస్తుతం అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో కొనసాగుతున్న సూర్య కిరణ్ రాబొయ్యే రోజుల్లో తన పెర్ఫార్మన్స్ ద్వారా ప్రేక్షకుల నుండి ఓట్లు సంపాదించుకొని సేఫ్ అవుతాడో లేదో చూడాలి అంటే ఆదివారం వరుకు వేచి చూడక తప్పదు

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…