
భారీ అంచనాల నడుమ మొన్న ఆదివారం నాడు బిగ్ బాస్ సీసన్ 6 స్టార్ మా ఛానల్ లో ఘనంగా ప్రారంభమైన సంగతి మన అందరికి తెలిసిందే..ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మొదటి రోజు ని విజయవంతంగా పూర్తి చేసుకుంది..మొదటి రోజే క్లాస్, ట్రాష్ మరియు మాస్ అంటూ ఆసక్తికరమైన టాస్కుని ప్రారంభించిన బిగ్ బాస్ ప్రేక్షకులను మొదటి రోజే టీవీలకు అతుక్కుపోయి చూసేలా చేసాడు..అయితే ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అనే విషయం ఇంకా తెలియకపోయిన ట్రాష్ తరగతి లో ఉన్న ఆది రెడ్డి, గీతూ రాయల్ మరియు ఇనియానా సుల్తానా లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియా లో అప్పుడే చర్చలు ప్రారంభం అయ్యాయి..అయితే కొన్ని వెబ్ సైట్స్ లలో వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది పొలింగ్స్ నిర్వహించారు..ఈ పొలింగ్స్ ఆధారంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముందుగా మొదటి రోజే తన చలాకీతనం తో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ గీతూ రాయల్..మొదటి రోజే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు షురూ చేసిన ఈమె ట్రాష్ తరగతి లో ఉన్న ముగ్గురు ఇంటి సభ్యులలో టాప్ 2 కంటెస్టెంట్ గా కొనసాగుతుంది..ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి అయితే చాలా తక్కువ..ఇక ఎప్పుడు బిగ్ బాస్ సీసన్స్ కి సంబంధించి రివ్యూస్ ఇస్తూ ఉండే నెల్లూరు కుర్రోడు ఆది రెడ్డి అత్యధిక ఓట్లతో టాప్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు..ఈయన మొదటి రోజే కొబ్బరి బొండం టాస్కుని కూడా బాగా ఆది ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు..ఇక చివరి స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఇనియానా సుల్తానా..మొదటి రోజే ఈమె గీతూ రాయల్ తో గొడవలకు దిగింది..అయితే ఈమెకి పెద్దగా పాపులారిటీ లేకపోవడం తో ట్రాష్ లిస్ట్ లో ఉన్న ముగ్గురు ఇంటి సభ్యులలో చివరి స్థానం లో కొనసాగుతుంది.
ప్రస్తుతానికి అయితే ఇనియానా సుల్తానా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..ఆమె రాబోయే రోజుల్లో బాగా ఆడితే నామినేషన్ లిస్ట్ నుండి సేవ్ అయ్యి హౌస్ లో కొనసాగొచ్చేమో చూడాలి..20 మంది ఇంటి సభ్యులతో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ఈసారి కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ కి చోటు లేనట్టే అనిపిస్తుంది..స్టార్ మా లో ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో డిస్నీ + హాట్ స్టార్ లో 24/7 లైవ్ టెలికాస్ట్ అవుతుంది..ఎన్నడూ లేని విధంగా స్టార్ మా ఛానల్ ఈ కొత్త పద్దతిని ప్రవేశ పెట్టింది..ఇప్పటికిప్పుడు మనం హాట్ స్టార్ లో ప్రస్తుత క్షణం లో బిగ్ బాస్ హౌస్ లో ఏమి జరుగుతుందో చూసేయొచ్చు..అంతే కాకుండా ప్రతి రోజు టీవీ లో ప్రసారమయ్యే ఎపిసోడ్ ని కూడా మనం హాట్ స్టార్ లో ప్రత్యేకంగా చూడవచ్చు.