Home Entertainment మొదటి రోజు ఆచార్య సినిమాకి ఎంత లాభాలు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మొదటి రోజు ఆచార్య సినిమాకి ఎంత లాభాలు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
1,607

మెగాస్టార్ ఆచార్య భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించడంతో భారీ అంచనాల కారణంగా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.45 కోట్ల షేర్ వచ్చింది. శని, ఆదివారాల్లో వచ్చే వసూళ్లు రూ.30 కోట్లు ఉంటాయని ట్రేడ్ లెక్కలు వేస్తోంది. దీంతో తొలి వీకెండ్‌లో ఆచార్య ఎంత లేదన్నా రూ.70 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సినిమా బిజినెస్‌లో 50 శాతం తొలి వీకెండ్‌లోనే వచ్చేస్తుంది. మిగతా 50 శాతాన్ని ఆచార్య రాబడతాడా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు చూస్తే ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్-2 సినిమాలకు ఇంకా మంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇంకో రెండు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా ప్రమోషన్‌లు జోరు అందుకోనున్నాయి.

ఇన్ని సవాళ్ల మధ్యలో ఆచార్య ఫుల్ రన్‌లో బ్రేక్ ఈవెన్‌కు చేరుతుందో లేదో అని బయ్యర్లు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ రేట్లు పెంచడం, 5వ షోకు అనుమతి ఇవ్వడంతో ఆచార్య కొంతవరకు గట్టెక్కాడు. ఆచార్య ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. చిరంజీవి కెరీర్‌లో సైరా తర్వాత సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఆచార్య చేసిందనే టాక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఏరియా వైజ్‌గా ఆచార్య థియేట్రికల్ హక్కులు అమ్ముడైన వివరాల్లోకి వెళ్తే.. నైజాంలో రూ.36 కోట్లకు అమ్మారు. సీడెడ్ రూ.20 కోట్లు, ఉత్తరాంధ్ర 13.5 కోట్లకు అమ్మారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య రూ. 109 కోట్ల బిజినెస్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 11 కోట్లకు, ఓవర్సీస్ మరో రూ. 11 కోట్లకు అమ్మారు. మొత్తంగా రూ. 131 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసింది. కాబట్టి ఆచార్య టార్గెట్ రూ. 150 కోట్ల పైమాటే. బుకింగ్స్ పరంగా ఆచార్య అంతగా జోరు చూపలేదు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య చిత్రాన్ని నిర్మించారు. ధ‌ర్మ‌స్థ‌లి అనే ప్రాంతంలోని అమ్మవారి గుడి చుట్టూ న‌డిచే క‌థ‌. ఇందులో చిరంజీవి, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ న‌క్స‌లైట్లుగా న‌టించారు.

అయితే ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా శుక్రవారం నాడు కొరటాల శివ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. దీంతో మెగా అభిమానులు కొరటాలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వల్లే ఆచార్య సినిమా స్క్రిప్ట్ అంతా మారిపోయిందని, కొరటాల శివను తీయనివ్వలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొరటాల శివ వల్లే సినిమా ఇలా వచ్చిందంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమాను మరీ ఇంత నాసిరకంగా తీయడంపై పెదవి విరుస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవిని కుర్రాడిగా చూపించేందుకు వాడిని గ్రాఫిక్స్, దాని క్వాలిటీని కొందరు ఏకిపారేస్తున్నారు. ఆ సీన్, చిరు ఫేస్ నవ్వుకునేలా ఉందంటూ చిరంజీవి అభిమానులు హర్ట్ అవుతున్నారు. స్వయంగా మాటల రచయిత అయ్యుండి కొరటాల శివ ఈ మూవీలో ఒక్క డైలాగ్ కూడా పవర్‌ఫుల్‌గా రాసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొరటాల రాసుకున్న డైలాగ్స్ కూడా చెప్పించిన తీరులో కృతకత్వం ఉంది తప్ప సహజత్వం లేదని కామెంట్ చేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…