
ఇటీవల కాలం లో నేషనల్ లెవెల్ లో మీడియా లో సంచలనం సృష్టించిన జంట నరేష్ – పవిత్ర లోకేష్..వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్న విషయం ఎంత పెద్ద దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే..బెంగళూరు లో ఒక హోటల్ లో నరేష్ – పవిత్ర పట్టుబడడం..వాళ్ళిద్దరిని మీడియా ముందు చెప్పుతో కొట్టడానికి నరేష్ మూడవ భార్య రమ్య రావడం పెద్ద చర్చకి దారి తీసింది..ఇప్పటికి ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంది..అయితే పవిత్ర లోకేష్ తో కూడా నరేష్ విడాకులు తీసుకున్నదంటూ సోషల్ మీడియా లో వచ్చిన వార్తలకు సమాధానం గా నరేష్ కొద్దిరోజుల క్రితం పవిత్ర లోకేష్ మీద చేతులు వేసుకొని మాట్లాడుతూ ఒక సినిమా ప్రమోషన్ కోసం వీడియో బైట్ ఇస్తాడు..ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అంతే కాకుండ సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయినప్పుడు నరేష్ – పవిత్ర జంటగా కలిసి ఆరోజు మొత్తం ఆ ప్రాంగణం లో తిరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇది ఇలా ఉండగా పవిత్ర లోకేష్ హీరోయిన్ అవుదామనే కళ్లతోనే కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది..కన్నడ లో ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ తర్వాత ఎక్కువగా విలన్ రోల్స్ ద్వారానే పాపులారిటీ ని సంపాదించింది..అయితే కొద్దీ రోజుల క్రితం ఈమె కన్నడ కి చెందిన ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది..ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన జీవితం లో ఎదురుకున్న కష్టాలను చెప్పుకొని కంటతడి పెట్టింది..ఆమె మాట్లాడుతూ ‘సినిమాల్లో అవకాశాలు అంత తేలికగా రావు..అందులోనూ ఒక అమ్మాయి ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి..అలా నేను నా సినీ జీవితం లో నేను ఎన్నో చేదు అనుభవాలను మూటగట్టుకున్నాను..అవకాశం కావాలంటే డైరెక్టర్స్ లైంగికంగా సంబంధాలను కోరుకుంటారు..ఇలాంటివి నాకు కూడా చాలా ఎదురయ్యాయి..ఎవరైనా డైరెక్టర్ సినిమాలో మంచి పాత్ర ఇస్తే బదులుగా ఏమి కోరుకుంటాడో అని బయపడేదానిని’ అంటూ చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.
‘అలా తమిళం లో ఒక స్టార్ హీరో నాకు హీరోయిన్ అవకాశాలు ఇస్తాను అని చెప్పి దారుణంగా మోసం చేసాడు..తన అవసరాలకు నన్ను బాగా వాడుకొని వదిలేసాడు’ అని చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్..ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఇది ఇలా ఉండగా పవిత్ర లోకేష్ ఇటీవలే నరేష్ మూడవ భార్య పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది..తనపై అక్కసుతో కావాలని యూట్యూబ్ చానెల్స్ చేత అసత్య ప్రచారాలు చేయిస్తుందని..తక్షణమే దీనిపై విచారణ చేపట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని పవిత్ర లోకేష్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది..ఈ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది..ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది..తమిళం లో పలు సీరియల్స్ లో కూడా ఆమె తీరిక లేకుండా గడుపుతుంది.