
టాలీవుడ్‌లో సినిమాల పండగ కొనసాగుతోంది. భీమ్లా నాయక్‌తో మొదలైన హడావిడి ఇంకా నడుస్తూనే ఉంది. రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్-2, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్ 3 సినిమాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. బాక్సాఫీస్ వద్ద ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా క్రేజీ మూవీస్‌గా నిలిచాయి. ఈ వారం కూడా క్రేజ్ ఉన్న మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అడివిశేష్ నటించిన మేజర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకు రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కడం అయితే రెండోది సూపర్ స్టార్ మహేష్‌బాబు సొంత బ్యానర్‌లో నిర్మితం కావడం. ఈ రెండు అంశాలే మేజర్ సినిమాకు మేజర్ హైలెట్స్‌గా నిలిచాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ వారం బాక్సాఫీస్ దగ్గర మేజర్‌కు పోటీ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమానే. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. కోలీవుడ్‌లో వాలిమై, ఈటీ, బీస్ట్, డాన్ సినిమాల తర్వాత క్రేజ్ ఉన్న సినిమాగా విక్రమ్ తెరకెక్కింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం, ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, సూర్య, ఫాహాద్ ఫాజిల్ నటించడం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కట్ చేస్తే మేజర్, విక్రమ్ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి. మండే వేసవిలో బయ్యర్లకు కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇప్పటివరకు అందిన ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో అడివి శేష్ మేజర్ సినిమాకు రూ.5 కోట్ల వసూళ్లు రాగా.. కమల్ హాసన్ విక్రమ్ సినిమా రూ.3 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
మేజర్ సినిమాను విడుదలకు ముందే ప్రీమియర్ షోల ద్వారా పలు ప్రాంతాల్లో ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా 88 ప్రీమియర్ షోలకు అన్ని షోలు హౌస్‌ఫుల్స్ కావడం విశేషం. హైదరాబాద్ సిటీలోనూ రిలీజ్ రోజుకు ముందు పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించగా మంచి రెస్సాన్స్ లభించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక విక్రమ్ సినిమా విషయానికి వస్తే.. కమల్ హాసన్ ఎంట్రీ సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉండటమే కాకుండా కథలోకి తీసుకెళ్లేందుకు తోడ్పాటు అందించింది. ఇక విజయ్ సేతుపతి పాత్ర పరిచయం పవర్‌ఫుల్‌గా, భయానకంగా ఉంది. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ పాత్ర ఎంట్రీ మరో హైలెట్. అయితే ఫస్టాఫ్‌లో కథ ఎక్కడా కనిపించకుండా కథనమే డామినేట్ చేయడం కొంత నిరాశను కలిగించే విషయంగా కనిపిస్తుంది. ఈ సినిమా చివర్లో సూర్య ఎంట్రీ మరో హైలెట్. కథకు ప్రాధాన్యం ఇవ్వకుండా సీన్లను పేర్చుకుంటూ వెళ్లి చేసిన సరికొత్త ప్రయోగం విక్రమ్ అని ప్రచారం జరుగుతోంది.