
తెలుగు సినిమా లవర్స్ కి గత కొంత కాలం నుండి మూవీ ఫెస్టివల్ నడుస్తుంది అని చెప్పొచ్చు..అఖండ , ఉష్ప , భీమ్లా నాయక్ , #RRR , KGF చాప్టర్ 2 , సర్కారు వారి పాట మరియు F 3 ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో కనుల పండగని తలపించేలా చేస్తుంది..మధ్యలో రాధే శ్యామ్ మరియు ఆచార్య వంటి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచిన కూడా ఎక్కువ శాతం ఈసారి ఘానా విజయం సాధించి ప్రేక్షకులను అలరించిన సినిమాలే ఉన్నాయి..ఇక టీజర్స్ మరియు ట్రైలర్స్ తో విడుదల కి ముందు నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపిన చిత్రాలు మేజర్ మరియు విక్రమ్ సినిమాలు..ఈ సినిమాలు రెండు ఈరోజు విడుదల అయ్యాయి..ఉన్నికృష్ణన్ జీవిత చిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన మేజర్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా నిర్మించాడు..ఇక ఖైదీ మరియు మాస్టర్ వంటి సెన్సషనల్ హిట్స్ తర్వాత లోకేష్ కనకరాజ్ కమల్ హస్సన్ తో విక్రమ్ తీసాడు..ఈ సినిమాలో కమల్ హస్సన్ హీరో గా నటించగా విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించారు..ఇక తమిళ హీరో సూర్య ఈ సినిమా లో గెస్ట్ పాత్రలో కనిపిస్తారు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ రెండు సినిమాలకు పబ్లిక్ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ముందుగా మనం ఉలంగ నాయగన్ కమల్ హస్సన్ నటించిన విక్రమ్ సినిమా పబ్లిక్ టాక్ గురించి మాట్లాడుకుందాం..చాలా కాలం తర్వాత ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో కమల్ హస్సన్ సినిమాని థియేటర్స్ లో తప్పనిసరిగా చూడాలి అని అనిపించేలా చేసిన మూవీ విక్రమ్..ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అవ్వడం..దానికి తోడు కాస్టింగ్ కూడా అదిరిపోవడం తో మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి..దానికి తగ్గట్టుగా టీజర్ మరియు తరిలేరు ఈ సినిమా పై అంచనాలను పదింతలు పెంచేసింది..అంతతి భారీ అంచనాలు ఏర్పాటు చేసిన ఈ సినిమా , ఆ అంచనాలను మొదటి ఆట నుండే అందుకోవడం లో సక్సెస్ అయ్యింది..ముఖ్యంగా కమల్ హాసన్ నటన మరియు సూర్య గెస్ట్ రోల్ ని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఒక్క రేంజ్ థ్రిల్ కి ఫీల్ అయ్యారు..బయట ఈ సినిమా టాక్ ఏ రేంజ్ లో ఉంది అంటే ప్రతి ఒక్కరు థియేటర్స్ లో కచ్చితంగా చూడాల్సిన సినిమా..అసలు మిస్ అవ్వద్దు అనే రేంజ్ లో ఉన్నది..మొదటి రోజు ఓపెనింగ్స్ అన్ని బాషలలో దుమ్ము లేపేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో అద్భుతమైన బాక్స్ ఆఫీస్ నంబర్స్ ని కొల్లగొడుతుంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట..కాబట్టి ఈ సినిమాని వీకెండ్ లో ఎవ్వరు కూడా మిస్ కాకండి.
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరో సినిమా అడివి శేష్ హీరో గా మహేష్ బాబు న్రిమన సారథ్యం లో తెరకెక్కిన మేజర్ సినిమా గురించి..26 /11 లో ముంబై లో జరిగిన బాంబు దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను అరిపించిన ఉన్ని మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని చేసిన ఈ సినిమాకి కూడా అదిరిపొయ్యే టాక్ వచ్చింది..ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ ఈ సినిమాలో జీవించేసాడు..ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో అడవి శేష్ ప్రేక్షకుల మనసుని పిండేసి కంటతడి పెట్టేలా చేసాడు..ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు గర్వంగా ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకునే విధంగా ఈ సినిమాని తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు శశి కుమార్..ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమాని అసలు మిస్ అవ్వద్దు అని క్రటిక్స్ రివ్యూస్ ఇస్తున్నారు..ఇలా ఈరోజు విడుదల అయినా రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చాయి..ఇక ఆలస్యం దేనికి ఈ వీకెండ్ మరోసారి అందరూ మూవీ ఫెస్టివల్ చేసుకోవడానికి సిద్ధం అవ్వండి.