
అడవి శేష్ హీరో గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కిన మేజర్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి ముందే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను విప్రరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత కూడా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకి దూసుకుపోతుంది..ఇటీవల కాలం లో ఈ సినిమాకి వచ్చినన్ని ప్రశంసలు మరియు అద్భుతమైన రేటింగ్స్ ఏ సినిమాకి కూడా రాలేదు అనే చెప్పాలి..26 /11 తేదీన ముంబై లోని తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్రవాదుల దాడులను కళ్ళకి కట్టినట్టు చిపించిన డైరెక్టర్ శశి కుమార్ కి ఎక్కడ చూసిన ప్రశంసల జల్లు కురుస్తుంది..ఈ దాడుల్లో తన ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని చేసిన సినిమా ఇది..ఉన్నికృష్ణన్ గా అడవి శేష్ నటన అద్భుతం అనే చెప్పాలి..ఈ సినిమాలో ఆయన నటించాడు అని అనడం కంటే జీవించాడు అనే చెప్పాలి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ విడుదలకి పది రోజుల ముందు నుండే కొన్ని మేజర్ సిటీస్ లో స్పెషల్ ప్రీమియర్ షోస్ వేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇలా ఒక్క సినిమాకి విడుదలకి పది రోజుల ముందు ప్రీమియర్స్ వెయ్యడం ఇదే తొలిసారి..పొరపాటున టాక్ తేడా కొడితే సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి తారుమారు అయ్యే అవకాశాలే ఎక్కువ..కానీ ఈ సినిమా ఔట్పుట్ మీద నిర్మాత మహేష్ బాబు కి ఉన్న నమ్మకం అలాంటిది మరి..అప్పటి నుండి వేస్తున్న ప్రీమియర్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ వల్లే ఈరోజు ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడానికి కారణంగా మారింది అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సీలెబ్రిటీ ప్రీమియర్ షో ని నిన్న హైదరాబాద్ లో నిర్వహించాడు మహేష్ బాబు..ఈ షో కి టాలీవుడ్ చెందిన సెలెబ్రటీలతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా రావడం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
అకిరా నందన్ ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో తెగ కనిపిస్తున్నాడు..ఇంత కాలం మీసం గెడ్డం లేకుండా చిన్న పిల్లోడిలా కనిపించిన అకిరా..ఇప్పుడు సన్నని గెడ్డం తో , స్టలిష్ హెయిర్ స్టైల్ తో నిన్న ప్రీమియర్ షో కి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..హాలీవుడ్ హీరో కటౌట్ తో తండ్రి కి తగ్గ తనయుడిగా ఆ డ్రెస్సింగ్ స్టైల్, నడిచే తీరు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు మురిసిపోతున్నారు..తొందరగా సినిమాల్లోకి దింపు అన్నా అంటూ పవన్ కళ్యాణ్ ని ట్విట్టర్ లో టాగ్ చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు..మరి అకిరా నందన్ సినిమాల్లోకి వస్తాడా లేదా అనేది చూడాలి..అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ తన కొడుకుకి నటన మీద ఆసక్తి లేదు అని..కేవలం మ్యూజిక్ మీద మాత్రమే ఆసక్తి ఉంది చెప్పడం తో అభిమానులు కాస్త నిరాశకి గురి అయ్యారు..అయితే పవన్ కళ్యాణ్ కి కూడా మొదట్లో సినిమాల మీద ఆసక్తి ఉండేది కాదు అని..ఆ తర్వాత కాలమే ఆయనని సినిమాల్లోకి అడుగుపెట్టేలా చేసింది అని..అకీరానందన్ కూడా అంతే అని..నటన వాళ్ళ రక్తం లోనే ఉంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.