Home Entertainment మేజర్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మేజర్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
4,281

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సారథ్యం లో అడవి శేష్ హీరో గా తెరకెక్కిన మేజర్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..నిన్న మొన్నటి వరుకు ఒక మాములు హీరోగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న అడవి శేష్ ని ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ ని చేసింది..ముంబై లో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది..విడుదలకి ముందు నుండే టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ దగ్గర నుండే బాక్స్ ఆఫిస్ విద్వాంసం ప్రారంభం అయ్యింది..ప్రపపంచ వ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ చిత్రానికి బాహుబలి పార్ట్ 2 తరహా లో విడుదలకి ముందు నుండే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పైడ్ ప్రీమియర్ షోస్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకి అద్భుతమైన టాక్ రావడం తో మొదటి రోజు మొదటి ఆట నుండే కలెక్షన్స్ కుమ్మేసాయి..అదే రోజు పోటీ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమాని కూడా ఎదురుకొని, మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం ఈ సినిమా మొదటి రోజే 50 శాతం కి పైగా రికవరీ చేసింది..ఇక మూడు రోజులకు ప్రీ రిలీజ్ బిజినెస్ కి పెట్టిన డబ్బులు మొత్తం రాబట్టి లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా తోలి వారం లో 26 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా పై విక్రమ్ సినిమా ప్రభావం పడింది అనే చెప్పాలి..ఓపెనింగ్స్ లో మేజర్ సినిమా అప్పర్ హ్యాండ్ సాధించగా..విక్రమ్ సినిమా ఫుల్ రన్ లో సత్తా చాటింది..దాని వల్ల మేజర్ సినిమా మొదటి వారం తర్వాత కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే సాధించగలిగింది..20 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని అడవి శేష్ కి ఏకంగా 30 కోట్ల రూపాయిల షేర్ ఈ సినిమా ద్వారా వచ్చింది.

ఇక ఈ సినిమా హిందీ బెల్ట్ లో ఓపెనింగ్స్ మొదటి రోజు చాలా వీక్ గా ఉన్నాయి..కానీ మౌత్ టాక్ చిన్నగా పెరుగుతూ పోవడం తో అక్కడ ఫ్లాప్ అవ్వాల్సిన ఈ సినిమా గట్ అయిపోయింది..హిందీ లో ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చెయ్యగా..షేర్ 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా..ఈ సినిమాని హిందీ లో మహేష్ బాబు సొంతగా విడుదల చేసుకున్నాడు..ఇలాంటి దేశ భక్తి సినిమాలను నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తారు అనే ఆయన నమ్మకం ని నిలబెట్టింది ఈ సినిమా..హీరో గా వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న మహేష్ బాబు కి నిర్మాతగా కూడా ఈ ఏడాది అద్భుతంగా కలిసి వచ్చింది అనే చెప్పాలి..ఇక ఈ సినిమా పై చిరంజీవి , పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఇటీవలే ప్రశంసల వర్షం కురిపించిన సంగతి మన అందరికి తెలిసిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…