
ప్రస్తుతం సీనియర్ హీరోలలో మంచి ఊపు లో ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ..గత ఏడాది ఆయన హీరో గా నటించిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసిందే..అతి తక్కువ టికెట్ రేట్స్ మీద విడుదలైన ఈ సినిమా సుమారు 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..అలాంటి సక్సెస్ తర్వాత వెంటనే అన్ స్టాపబుల్ విత్ NBK ప్రోగ్రాం కూడా భారీ హిట్ అవ్వడం వల్ల బాలయ్య బాబు కి ఫామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది..ఒక్కప్పటి బాలయ్య బాబు లాగ కాకుండా, ప్రస్తుతం మనం సరికొత్త బాలయ్య బాబు ని చూస్తున్నాం అనే చెప్పాలి..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ రెండవ సీసన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సీసన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..అలా ఆహా మీడియా బాలయ్య ని సరికొత్త కోణం లో చూపించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు.
అలా ఆహ మీడియా లో వరుసగా రెండు సక్సెస్ ఫుల్ సీసన్స్ చేసేలోపు బాలయ్య బాబు కి అల్లు అరవింద్ తో మరింత బలమైన సాన్నిహిత్యం ఏర్పడింది..నందమూరి కుటుంబం తో అల్లు ఫామిలీ దశాబ్దాల నుండే మంచి సాన్నిహిత్యం ఉంది..ఇప్పుడు ఆహాలో చేస్తున్న ఈ టాక్ షో తో ఆ సాన్నిహిత్యం మరో లెవెల్ కి వెళ్ళింది..ముఖ్యంగా అల్లు కుటుంబం మెగా ఫామిలీ కంటే బాలయ్య బాబు కి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం ఇప్పుడు సెన్సషనల్ గా మారిన అంశం..అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా హాజరవ్వడం..అదే సమయం లో ఆహా లో అన్ స్టాపబుల్ షో చెయ్యడం..అందులో కూడా అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా ఒక ఎపిసోడ్ లో రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటె మెగా ఫామిలీ లో అంత మంది హీరోలు ఉన్నా కూడా బాలయ్య బాబు వెంట అల్లు ఫామిలీ పడడం ఏమిటని మెగా అభిమానులు సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు శిరీష్ హీరో గా నటించిన ‘ఊర్వశివో రాక్షసీవో’ అనే సినిమా నవంబర్ నాల్గవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా బాలయ్య బాబు ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నాడట..ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడు అని వార్తలు వినిపించిన అవి కేవలం పుకారు మాత్రమే అని తెలిసింది..ఇప్పుడు బాలయ్య బాబు ముఖ్య అతిధిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం తో ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..అల్లు కుటుంబం ఇలా బాలయ్య బాబు కి దగ్గర అయ్యి మెగా ఫామిలీ ని దూరం పెట్టడం దేనిని సూచిస్తుంది..?? అంటే మెగా ఫామిలీ తో అల్లు ఫామిలీ కి అంతర్గత పోరు ఉందని చెప్పకనే చెప్తున్నారా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి..ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు ఏమి మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.