Home Entertainment మెగాస్టార్ ‘బాస్ పార్టీ’ సాంగ్ క్రేజ్ ముందు తుస్సుమన్న ‘జై బాలయ్య’ సాంగ్

మెగాస్టార్ ‘బాస్ పార్టీ’ సాంగ్ క్రేజ్ ముందు తుస్సుమన్న ‘జై బాలయ్య’ సాంగ్

0 second read
0
0
2,384

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హీరోలు తమ సినిమాలతో పోట్లగిత్తలు లాగ పోటీపడడానికి సిద్ధం అయ్యిపోతారు..ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ కూడా ఎవ్వరు ఊహించని రేంజ్ లో ఉండబోతుంది..ఎందుకంటే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ , ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో మన ముందుకి రాబోతున్నారు..చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు హీరోలు తమ అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా మారి సినిమాలు చేస్తుండడం తో ఫాన్స్ లో ఈ రెండు చిత్రాలపై అంచనాలు మాములు రేంజ్ లో లేవు..ఇక ఇటీవలే ఈ రెండు సినిమాలకి సంబంధించిన మొదటి లిరికాల్ వీడియోస్ ని విడుదల చేసారు..సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన ‘బాస్ పార్టీ’ మరియు ‘జై బాలయ్య’ సాంగ్స్ తో దుమ్ము లేచిపోతుంది..అయితే ఈ రెండు సాంగ్స్ లో ఏది పైచెయ్యి సాధించిందో ఇప్పుడు మనం చూద్దాము.

ముందుగా చెప్పాలంటే ఈ రెండు సాంగ్స్ కి సోషల్ మీడియా నుండి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది..చాలా రొటీన్ గా ఉన్నాయని..ఈ థమన్, దేవిశ్రీప్రసాద్ ఇక మారారని తిట్టుకొచ్చారు నెటిజెన్స్..ముఖ్యంగా జై బాలయ్య సాంగ్ అయితే ఒసేయ్ రాములమ్మ సాంగ్ ని తలపించింది..ఆ సాంగ్ ని మళ్ళీ తిప్పి కొట్టారంటూ విమర్శలు వచ్చాయి..కానీ బాస్ పార్టీ సాంగ్ మెల్లిగా జనాల్లోకి ఎక్కేసింది..కానీ జై బాలయ్య సాంగ్ మాత్రం తుస్సుమంది..బాస్ పార్టీ సాంగ్ కి ఇప్పటి వరుకు కోటి 50 లక్షల వ్యూస్ వస్తే..జై బాలయ్య సాంగ్ కి కేవలం వ్యూస్ మాత్రమే వచ్చాయి..బాస్ పార్టీ సాంగ్ కి రోజుకి సగటున రెండున్నర లక్షల వ్యూస్ వస్తుంటే, జై బాలయ్య సాంగ్ కి పది లక్షల వ్యూస్ మాత్రమే వస్తున్నాయి..ఆలా మెగాస్టార్ చిరంజీవి బాలయ్య మీద అప్పర్ హ్యాండ్ సాధించేసాడు..చిరంజీవి ఒక్కసారి మాస్ లోకి దిగితే ఆయన ముందు ఏ స్టార్ కూడా పనికి రాడు అనడానికి నిదర్శనం ఇదే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ హవ్వా నే నడుస్తుంది..వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 110 కోట్ల రూపాయలకు జరిగితే , వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ 70 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..వాస్తవానికి పట్టుమని 20 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని బాలయ్య బాబు ని మెగాస్టార్ లాంటి శిఖరం తో పోల్చడం కాస్త కామెడీనే కానీ..ఈ మాత్రం చిరంజీవి కి పోటీ అని చెప్పుకోదగ్గ స్థాయి కి బాలయ్య బాబు సినిమా బిజినెస్ జరిగి దాదాపుగా రెండు దశాబ్దాలు దాటింది..ఇప్పుడు సడన్ గా బాలయ్య బాబు సినిమాకి మార్కెట్ పెరగడానికి కారణం అఖండ చిత్రం..గత ఏడాది విడుదలైన ఈ సినిమా 70 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను రాబట్టింది..అందుకే వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది..కానీ ఫ్లాప్ అయితే కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ రావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు చెప్తున్నమాట.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…