Home Entertainment మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ స్టోరీ లీక్..మెగాస్టార్ కి ఇంద్ర రేంజ్ హిట్ పడినట్టే ఇక!

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ స్టోరీ లీక్..మెగాస్టార్ కి ఇంద్ర రేంజ్ హిట్ పడినట్టే ఇక!

0 second read
0
0
10,783

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్, మంచి విజయాన్ని అందుకుంది, ఫాన్స్ అందరు సినిమాని బాగా ఎంజాయ్ చేసారు, కాకపోతే కలెక్షన్స్ పరంగా అభిమానులకి నిరాశే మిగిలింది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఇపుడు మెగా ఫాన్స్ ఉన్న ఆస అలా తదుపరి చిత్రం “వాల్తేరు వీరయ్య” ఈ సినిమాకి దర్శకుడు బాబీ. ఇందులో మాస్ రాజా రవితేజ ఒక కీలక పాత్రా పోషిస్తున్నాడు.ఐతే చిత్ర యూనిట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక టీజర్ ఫాన్స్ అంచనాలు అమాంతంగా పెంచేసింది. ఇందులో మెగాస్టార్ ఊరమస్ లుక్ లో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మెగాస్టార్ ఘరానా మొగుడు గెటప్ గుర్తు చేసింది. వాల్తేరు వీరయ్య వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవలే రిలీజ్ అయినా టీజర్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రవితేజతో పాటు శృతి హస్సన్, ప్రకాష్ రాజ్, సత్యరాజ్ తదితరులు నటించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక స్టోరీ వైరల్ అవుతుంది. ఈ కధ నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ కధ వింటుంటే ఒక మంచి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది .

కధ విషయానికి వస్తే: –

సత్యరాజ్ అనే వ్యక్తి చాల ఆనందంగా ఉంటాడు అతనికి ఇద్దరు భార్యలు – ఒకరు ఆంధ్ర ఇంకొకరు తెలంగాణ. చిరంజీవి ఆంధ్ర భార్య కొడుకు , మరియు రవితేజ తెలంగాణ భార్య కొడుకు. చిరంజీవి పోర్ట్ వర్కర్స్ కి లీడర్ గా ఉంటాడు , రవితేజ ఏమో తెలంగాణ పోలీస్ ఆఫీసర్. ఇంకా ప్రకాష్ రాజ్ విలన్ స్మగ్లర్‌గా కనిపిస్తున్నాడు. ఐతే చిత్రం మొదటిలో చిరంజీవి, రవితేజ కి పోరు నడుస్తుంది . తరువాత వీళిద్దరి మధ్య ప్రకాష్ రాజ్ ఎంటర్ అవడంతో సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అని ఒక వార్త వినిపిస్తుంది.

చిరంజీవి గోదావరి యాస ఉంటుంది. మొత్తం మాస్ ఎంటెర్టైన్మెంట్గా ఉండబోతుంది చిరంజీవి క్యారెక్టర్. గత కొంతకాలంగా చిరంజీవి అభిమానులు తన మాస్ మిస్ అవుతున్నారు , ఇపుడు ఈ సినిమాతో అది తీరబోతుంది. ముఠా మేస్త్రి స్టైల్ లో ఉండబోతుంది అని వార్త బాగా వినిపిస్తుంది. చిరంజీవి కి మాస్ ఫాలోయింగ్ పెంచిన సినిమాలు ఘరానా మొగుడు , ముఠా మేస్త్రి అలాగే రౌడీ అలుడు. ఇపుడు వాల్తేరు వీరయ్య అలాగే ఉండబోతుంది . ఇదే గనుక నిజమైతే ఇంకా ఫ్యాన్సీకి పండగనే చెప్పుకోవాలి . వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా దిగబోతుంది .

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…