
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇండస్ట్రీ పెద్దగా నన్ను పిలవొద్దు అని ఆయన పదే పదే చెప్పినా కూడా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నట్టే ఉంటాయి..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన టికెట్ రేట్స్ కారణం గా టాలీవుడ్ చాలా కాలం పాటు పెద్ద సంక్షోభం ని ఎదురుకుంది..అలాంటి సమయం లో చిరంజీవి ముందుకి వచ్చి ఈ సమస్యని పరిష్కరించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆరోజు ఆయన అలా చెయ్యకపోయాయి ఉంటె ఈరోజు మనం #RRR వంటి సినిమాలను ఇప్పటికి చూసేవాళ్ళం కాదు..కలలో కూడా ఎప్పుడు ఒక మనిషి నొప్పించేట్టు మాట్లాడే స్వభావం లేని చిరంజీవి ఇటీవలే కొంతమంది డైరెక్టర్స్ వ్యవహరించిన తీరుపై ఆయన చేసిన కామెంట్స్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఒకప్పుడు మేము సినిమాలు చేస్తుంటే ఒక్క బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం మా ముందర ఉండేది..బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే అప్పట్లో షూటింగ్ ప్రారంబించేవాళ్ళం.
కానీ ఈమధ్య డైరెక్టర్స్ పని తీరే మారిపోయింది..స్క్రిప్ట్ రైటింగ్ డైలాగ్ రైటింగ్ వంటివి సెట్స్ లోకి అడుగుపెట్టినప్పుడు రాస్తున్నారు..అలా అయితే మేము డైలాగ్స్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి..రిహార్సల్స్ ఎప్పుడు చెయ్యాలి..క్యారక్టర్ ఓన్ చేసుకోవాలంటే ముందుగా ఇవన్నీ ఉండాలి కదా..ఈ పద్దతి తప్పకుండా మార్చుకోవాలి అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..ఈ ఏడాది చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదలై భరో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ సమయం లో కొరటాలశివ తో తనకి ఎదురైనా అనుభవం గురించి చిరంజీవి పరోక్షంగా మాట్లాడిన మాటలివి అని నెటిజెన్స్ అనుకుంటుంటూ ఉన్నారు..ఈ విషయం పై నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల భింబిసారా ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
చిరంజీవి గారు ఈమధ్య డైరెక్టర్స్ పై కొన్ని హాట్ కామెంట్స్ చేసారు..దీనికి మీ స్పందన ఏమిటి అని కళ్యాణ్ రామ్ ని అడగగా దానికి ఆయన సమాధానం చెప్తూ ‘చిరంజీవి గారికి ఎదురైనా అనుభవం నాకు అయితే ఎదురు అవ్వలేదు..ఒక సినిమా ఫెయిల్ అయ్యింది అంటే అందరితో పాటు నా తప్పు కూడా ఉంది అని భావిస్తా..ఎందుకంటే నేను ఒప్పుకోకపోతే అసలు ఆ సినిమానే ఉండేది కాదు..అలాంటి ఫలితమే వచ్చేది కాదు కదా..కాబట్టి సక్సెస్ వచ్చినప్పుడు టీం ఎఫర్ట్ అని ఎలా అంటామో, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా టీం ఎఫర్ట్ వల్లే వచ్చింది అంటాము’ అంటూ కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా మాట్లాడాడు..ఆయన హీరో గా నటించిన భింబిసారా చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ ని సాధించింది ఈ చిత్రం..విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.