Home Entertainment మెగాస్టార్ చిరంజీవి గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

మెగాస్టార్ చిరంజీవి గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

0 second read
0
2
19,007

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ఏకైక హీరో చిరంజీవి గారు మాత్రమే..స్వయంకృషి తో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి నెంబర్ 1 స్టార్ హీరో గా ఎదిగిన చిరంజీవి గారంటే ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరికి అభిమానమే..అయితే చిరంజీవి ఎదిగిన తీరు చూసి ప్రతి ఒక్కరికి అసూయ రాక తప్పదు..అందుకే ఆయన ఫెయిల్యూర్ ని ఒక పండగ లాగ చేసుకుంటారు..మూడు దశాబ్దాల నుండి ఎంతో మంది వారసులను దాటి తన సొంత టాలెంట్ తో ఏకాధిపత్యం చూపించిన హీరో కదా..ఆమాత్రం ఉంటుంది..దానికి ఉదాహరణే ఇటీవలే విడుదలైన ఆచార్య సినిమా..కొరటాల శివ దర్శకత్వం లో చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైంది..చిరంజీవి కెరీర్ లో ఒక మాయని మచ్చ లాగ నిలిచిపోయింది ఈ చిత్రం..ఆయన చేసిన 150 సినిమాలలో ఇంత చెత్త సినిమా ఎప్పుడు చెయ్యలేదని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమాకి మొదటి రోజు ఓవర్సీస్ నుండి నెగటివ్ టాక్ రాగానే పండగ చేసుకున్నారు చిరంజీవి దురాభిమానులు..ఎంతలాగ అంటే వారి అభిమాన హీరో విజయవంతం అయినప్పుడు కూడా ఇంతలాగా ఎంజాయ్ చేసి ఉండరు అని చెప్పొచ్చు..ఎవరు హిట్ కొట్టిన ట్విట్టర్ లో చిరంజీవి ని టాగ్ చేసి వెక్కిరించేవారు..ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ భింబిసారా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని కళ్యాణ్ రామ్ కెరీర్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..దీనితో నందమూరి అభిమానులు ‘మెగాస్టార్ కళ్యాణ్ రామ్’ అంటూ ట్రేండింగ్ చెయ్యడం మొదలు పెట్టారు..గత వారం రోజుల నుండి ఈ హాష్ టాగ్ మీద వాళ్ళు ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు..ఇది కళ్యాణ్ రామ్ దృష్టికి వెళ్ళింది..ఆయన దీనిపై చాలా సీరియస్ అయినట్టు సమాచారం..ఇలా చేసేవారిని నందమూరి అభిమానులు అని దయచేసి చెప్పుకోవద్దు అంటూ కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్ లో మీడియా తో సమావేశం అయినప్పుడు చెప్పాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘దయచేసి మెగాస్టార్ చిరంజీవి లాంటి వారితో నన్ను పోల్చకండి..అది కరెక్ట్ కాదు..మెగాస్టార్ అనే టాగ్ ఆయనకీ ఊరికినే రాలేదు..ఇండస్ట్రీ లో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని దశాబ్దాల నుండి ఆయన నెంబర్ 1 హీరో గా కొనసాగాడు కాబట్టే ఆయనకీ ఆ టాగ్ వచ్చింది..దయచేసి ఎవ్వరు కూడా ఆ టాగ్ ని వాడే సాహసం చెయ్యొద్దు..చిరంజీవి గారికి సాటి నేటి జనరేషన్ హీరోలు ఎవ్వరు కూడా సరితూగరు..ఆయన అనుభవం అంత కూడా మా వయస్సు ఉండదు..ఆన్లైన్ ట్రోల్ల్స్ ఏమైనా ఉంటె మీకు మీరు వేసుకోండి..నా పేరు వాడుకొని మాత్రం ట్రోల్ల్స్ చేయొద్దు’ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..నందమూరి అభిమానులకు చిరంజీవి అంటే ఎందుకు అంత పగనో అర్థం కాదు..నందమూరి కుటుంబం తో చిరంజీవి కి ఎంతో సాన్నిహిత్యం ఉంది..కానీ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తె బగ్గుమనేంత పగలు ఉన్నాయి..#RRR సినిమాతో ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య సఖ్యత కలుగురుంది అని అందరూ అనుకున్నారు..కానీ ఇప్పటికి సఖ్యత కుదరలేదు..మరి ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఎప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ ఆగుతాయో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…