Home Entertainment మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
2
2,891

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత వెంటనే వస్తున్నా చిరంజీవి సినిమా కావడం తో ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ మెగాస్టార్ రేంజ్ లో కాకుండా కాస్త తక్కువగానే జరిగింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా కేవలం 92 కోట్ల రూపాయలకు మాత్రమే థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి..చిరంజీవి గారి గత చిత్రం ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 140 కోట్ల రూపాయలకు జరిగింది..ఆ సినిమా పెద్ద ఫ్లాప్ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ మీద పడిందని..పైగా ఒక రీమేక్ సినిమా కాబట్టి తక్కువ మొత్తానికే ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరిపారని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ఇక ఈ సినిమా కి మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..నటన పరంగా , సబ్జెక్టు పరంగా మెగాస్టార్ చిరంజీవి ఈసారి మాములు కం బ్యాక్ ఇవ్వలేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

స్టార్టింగ్ రోలింగ్ టైటిల్స్ నుండి ఎండింగ్ వరుకు థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి అద్భుతాంగా అనుభూతిని కలిగించిందని..ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్స్ లో ఉన్న DTS బాక్సలు బద్దలైపోయాయి అని..చిరంజీవి స్క్రీన్ ప్రెజన్స్ కి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా నిలచిహిందని చెప్పుకుంటున్నారు..వాస్తవానికి థమన్ ఈ సినిమా ట్రైలర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానులు బాగా నిరాశకి గురైయ్యారు..చాలా ఊహించుకున్నామని..ఇలా ఇంత నీరసపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చావు అంటూ థమన్ ని అభిమానులు సోషల్ మీడియా లో టాగ్ చేసి తిట్టారు..కానీ సినిమా లోకి అడుగుపెట్టిన తర్వాత థమన్ విశ్వరూపం చూపించేసాడనే చెప్పాలి..ఇక చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఎం ఉంది..ఆయన రేంజ్ లో ఈమధ్య కాలం లో నటించడం లేదని అభిమానులు కాస్త నిరాశ చెందుతూ ఉండేవారు..అలాంటి అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ద్వారా భుక్తాయాసం రప్పించేలా చేసాడు.

సినిమా ఫస్ట్ హాఫ్ కి అభిమానులు సంతృప్తి పడ్డారు అనుకుంటే ఇక సెకండ్ హాఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఒరిజినల్ వెర్షన్ లూసిఫెర్ తో పోలిస్తే ఎక్కడ కూడా డ్రాగ్ లేకుండా చాలా అద్భుతంగా ఈ సబ్జెక్టు ని డీల్ చేసాడు డైరెక్టర్ మోహన్ రాజా..పేరు కి తమిళ దర్శకుడే కానీ..ఈ సినిమా చూస్తే ఆయన తెలుగు సినిమాలను ఎలా ఫాలో అవుతున్నాడు..మెగాస్టార్ చిరంజీవి అంటే అతనికి ఎంత ఇష్టం అనేది అర్థం అవుతుంది..ఆచార్య సినిమా తో మెగా ఫాన్స్ ఎంత నిరాశకి గురైయ్యారో గాడ్ ఫాదర్ సినిమాకి అంత సంతృప్తి చెందుతారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇక ఈ సినిమాలో విలన్ గా సత్యదేవ్ కూడా అదరగొట్టేసాడు అని చెప్పాలి..ఈ సినిమా అతని కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది..ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ బాగా ప్లస్ అయ్యాడనే చెప్పాలి..చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలకు అభిమానులు థియేటర్స్ లో కూర్చోలేరు..అంత అద్భుతంగా వచ్చాయి..మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమా అయితే అదిరిపోయింది..ఇక మెగాస్టార్ తన మాస్ తో ఈ సినిమాని ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…