Home Entertainment మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ క్లోసింగ్ కలెక్షన్స్..బ్లాక్ బస్టర్ టాక్ తో కూడా భారీ నష్టాలు

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ క్లోసింగ్ కలెక్షన్స్..బ్లాక్ బస్టర్ టాక్ తో కూడా భారీ నష్టాలు

0 second read
0
0
2,465

మెగాస్టార్ చిరంజీవికి వరుసగా మరో డిజాస్టర్ ఎదురైంది. ఆచార్య తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ సినిమా సైతం బయ్యర్లకు నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడో వారం ఈ సినిమాను కొనసాగించాలని ప్రయత్నించినా కొత్త సినిమాల ధాటికి చాలా చోట్ల ఈ సినిమాను ఎత్తేశారు. దీంతో రెండు వారాలకే గాడ్ ఫాదర్ కథ ముగిసినట్లు అయ్యింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసీఫర్ మూవీని రీమేక్ చేసి గాడ్ ఫాదర్‌గా మలిచారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తొలిరోజు హిట్ టాక్ వచ్చినా తొలి వీకెండ్ తర్వాత ఈ మూవీ వసూళ్లు క్రమంగా తగ్గిపోయాయి. రెండో వారంలోనూ గాడ్ ఫాదర్ అంతంత మాత్రంగానే వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

గాడ్ ఫాదర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.92 కోట్లు జరిగింది. అయితే ఇప్పటివరకు రూ.67 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా రూ.25 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా స్క్రీన్‌లు తగ్గిపోవడంతో ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో తొలి ఆరోరోజుల పాటు రూ.కోటికి పైగా షేర్ వసూలు చేసింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు సహా హిందీ భాషల్లో విడుదలైంది. పది రోజుల వ్యవధిలో సినిమాని తమిళ వర్షన్‌లో కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు మోహన్ రాజా చేసిన మార్పులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాడ్ ఫాదర్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.

కాగా లూసిఫర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో అందుబాటులో ఉండగా తాము ఈ మూవీని రీమేక్ చేయడమే చాలా డేరింగ్ డెసిషన్ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. అలాంటి సినిమాకు ఇంత వస్తున్నాయి అంత వస్తున్నాయి అని చెప్పుకోవడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. హీరోయిన్, డ్యూయట్స్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయోగం గాడ్ ఫాదర్ మూవీ. సత్యదేవ్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. బ్రహ్మ పాత్రలో చిరు నటన హైలెట్‌గా నిలిచింది. అయితే మలయాళంలో మోహన్ లాల్ నటన అలా ఉంది ఇక్కడ చిరంజీవి నటన ఇలా ఉంది అంటూ మొదలుపెట్టి ప్రతి ఫ్రేమ్ ను కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. లూసిఫర్ సినిమా కేవలం మలయాళంలో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ గాడ్ ఫాదర్ మూవీ తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ అన్నీ కలిపినా రూ.100 కోట్ల షేర్ దాటలేకపోయింది. దీంతో మోహన్‌లాల్ ఫ్యాన్స్ మెగాస్టార్ అభిమానులను దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…