
ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా గడ్డుకాలం తప్పదని అందరూ అంటూ ఉంటారు..మన కళ్ళతో ఎంతో మందిని అలా చూసాము కూడా..కానీ నాలుగు దశాబ్దాలు గా నెంబర్ హీరో స్థానం లో కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడికి కూడా ఇంత గడ్డు కాలం వస్తుందని అనుకోలేదు..రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 మరియు సైరా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ లో సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నెలకొల్పిన మెగాస్టార్ చిరంజీవి కి ఆచార్య చిత్రం దారుణమైన దెబ్బ వేసిందని చెప్పాలి..ఎందుకంటే ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం కి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ వసూళ్లు రాలేదు..చిరంజీవి కెరీర్ లో స్టార్ అయిన తర్వాత వీక్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది గాడ్ ఫాదర్ అనే చెప్పొచ్చు..మెగాస్టార్ స్టేటస్ కి తగ్గ వసూళ్లు రాకపొయ్యేసరికి చిరంజీవి పని ఇక అయిపోయినట్టేనా అని అభిమానులకు కూడా అనుమానం వచ్చింది.
మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ‘గాడ్ ఫాదర్’ సినిమా నిఖిల్ హీరో గా నటించిన ‘కార్తికేయ 2 ‘ క్లోసింగ్ కలెక్షన్స్ దాటలేకపోయింది..ఇక రీసెంట్ గా విడుదలైన అడవి శేష్ ‘హిట్ 2 ‘ చిత్రానికి సంబంధించిన కలెక్షన్స్ చాలా ప్రాంతాలలో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ని సైతం అధిగమించేస్తుంది..ముఖ్యంగా ఓవర్సీస్ లో..అక్కడ గాడ్ ఫాదర్ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 1.2 మిలియన్ వసూళ్లు మాత్రమే వసూలు చేసింది..కానీ హిట్ 2 చిత్రం మాత్రం కేవలం మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్కుకి చేరువ అయ్యింది..అంతే కాకుండా నైజం ప్రాంతం లో కూడా ఈ సినిమా గాడ్ ఫాదర్ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు..మెగాస్టార్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తి సినిమా కలెక్షన్స్ ని ఇలా నిన్నగాక మొన్న వచ్చిన చిన్న హీరోలు దాటేయడం నిజంగా ఆయనకీ ఇది అవమానకరమే.
మెగాస్టార్ మార్కెట్ ఇంత స్లంప్ అవ్వడానికి ప్రధాన కారణం రీమేక్స్..గాడ్ ఫాదర్ మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..ఆ చిత్రం తెలుగు లో డబ్ అయ్యి థియేటర్స్ లో విడుదల అవ్వడమే కాకుండా తెలుగు లో కూడా ఏళ్ల తరబడి అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండేది..అలా ఉన్న తర్వాత అలాంటి చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవడం నిజంగా చిరంజీవి చేసిన మిస్టేక్ అని చెప్పొచ్చు..అందువల్లే గాడ్ ఫాదర్ చిత్రం థియేటర్స్ లో సరిగా ఆడలేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది..ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది..మెగాస్టార్ ని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో..అలానే ఈ సినిమాలో చూడబోతున్నారు అని చెప్పడం తో అభిమానులు ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు..ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.