Home Entertainment మెగాస్టార్ కి కోలుకోలేని షాక్ ని ఇచ్చిన రవితేజ

మెగాస్టార్ కి కోలుకోలేని షాక్ ని ఇచ్చిన రవితేజ

0 second read
0
0
12,017

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ మూవీలో చిరంజీవి-రవితేజ కాంబో ఉంటుందనే టాక్ వచ్చింది. దీంతో అటు మెగాస్టార్, ఇటు మాస్ మహారాజా అభిమానులు ఖుషీ అయ్యారు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆచార్య ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టైటిల్‌ను శేఖర్ మాస్టర్ రివీల్ చేశాడు. రవితేజ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపిస్తాడని తెగ ప్రచారం జరిగింది. అంతా ఓకే అనుకుంటుంటే.. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆచార్య ఇచ్చిన షాక్ తరువాత తన కొత్త సినిమాలకు సంబంధించి చిరంజీవి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య సినిమా నుంచి రవితేజను తప్పించారనే పుకార్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ స్వయంగా తప్పుకున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రవితేజ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని.. అందుకే సినిమా నుంచి అతడిని పక్కనపెట్టారనే కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా కోసం రవితేజ స్థానంలో మరో స్టార్‌ను ఎంపిక చేస్తారనే చర్చ సాగుతోంది. ఈ సినిమా నుంచి రవితేజను తప్పించడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఆలోచన ఉందనే ప్రచారం ఉంది. రవితేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే మాత్రం అది నెగిటివ్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. విదేశాల్లో భార్యతో కలిసి వెకేషన్‌లో ఉన్న చిరంజీవి వచ్చేనెలలో తిరిగి హైదరాబాద్ రానున్నారు. అప్పుడే దీనికి సంబంధించి క్లారిటీ రానుందని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరంజీవితో కలిసి నటించిన అనుభవం రవితేజకు వుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన అన్నయ్య చిత్రంలో చిరుకి తమ్ముడిగా రవితేజ నటించాడు. కేవలం హీరో పాత్రలకే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లోనూ నటించాలని రవితేజ నిర్ణయించుకుని చిరంజీవి సినిమాకు ఓకే చెప్పాడు. అయితే ఆచార్య డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజా మనసు మార్చుకుని డ్రాప్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల కానుంది. ఇదే ఏడాది దసరాకు ధమాకా.. వచ్చే ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వరుసబెట్టి విడుదల కానున్నాయి. చిరంజీవితో సినిమా నుంచి బయటకు రావడం ఖాయం అయితే.. వేరే ప్రాజెక్టుల్లో రవితేజ నటిస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా రవితేజ నటించనున్నట్టు చెబుతున్నారు. మల్టీస్టారర్ మూవీస్ మరిన్ని రావాలని భావిస్తున్నవేళ రవితేజ చిరంజీవి ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడంపై ఆయన అభిమానులు ఏమంటారో చూడాలి. కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…