Home Entertainment మూడవ పెళ్లి పై మొదటిసారి నోరు విప్పిన చిరంజీవి కూతురు శ్రీజా

మూడవ పెళ్లి పై మొదటిసారి నోరు విప్పిన చిరంజీవి కూతురు శ్రీజా

0 second read
0
0
57,390

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు పలు వీడియోలు, ఫోటోలను మెగా అభిమానులకు షేర్ చేస్తుంటుంది. అయితే కొన్నిరోజుల కిందట ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి త‌న భ‌ర్త కళ్యాణ్‌దేవ్ పేరు తీసివేయ‌డంతో రచ్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శ్రీజ కూడా స‌మంత బాట‌లోనే విడాకులు తీసుకోబోతోందని తెగ ప్రచారం జరిగింది. అయితే విడాకుల గురించి ఇప్పటి వరకు అటు శ్రీజ, ఇటు కళ్యాణ్‌దేవ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అయితే క‌ళ్యాణ్‌దేవ్‌ను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అతడి చివ‌రి రెండు సినిమాల‌ను మెగా ఫ్యామిలీ ప‌ట్టించుకోక‌పోవ‌డం, అటు మెగా ఫంక్ష‌న్లు, కార్య‌క్ర‌మాల్లో క‌ళ్యాణ్‌దేవ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో శ్రీజతో విడాకులు ఖరారైనట్లు అభిమానులు విశ్వసిస్తున్నారు.

మరోవైపు ఇటీవల శ్రీజ మూడో పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కళ్యాణ్ దేవ్‌కి దూరంగా ఉంటోన్న శ్రీజ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని, అతనితో మూడో పెళ్లికి సిద్ధం అవుతోందని తెగ ప్రచారం జరుగుతోంది. శ్రీజ మూడో పెళ్లిపై ఫిలింనగర్‌లో భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ ఇష్యూపై కొందరు నటీనటులు, దర్శక నిర్మాతలు కూడా రియాక్ట్ అవుతుండటం హాట్ టాపిక్ అయింది. తాజాగా మూడో పెళ్లిపై శ్రీజ కూడా అధికారికంగా స్పందించింది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు సంకేతాలు పంపించింది. త్వరలోనే అతడిని శ్రీజ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందే శ్రీజ పెళ్లి గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీజ తన స్నేహితుడినే మూడో పెళ్లి చేసుకుంటుందని.. రెండు, మూడు నెలల్లోనే ఇది జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

కట్ చేస్తే శ్రీజ కూడా సేమ్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కళ్యాణ్‌దేవ్‌తో విడాకులు తీసుకోకముందే శ్రీజ మూడో పెళ్లి ఎలా చేసుకుంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా శ్రీజపై వస్తున్న ఆరోపణలపై సీనియ‌ర్ నిర్మాత త్రిపుర‌నేని చిట్టిబాబు చేసిన కామెంట్లు మ‌రింత గంద‌ర‌గోళానికి దారితీశాయి. అమ్మాయి లేదా అబ్బాయి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలియ‌జేయ‌డం పూర్తిగా త‌ప్పు అని.. శ్రీజ కూడా ఇలాంటి త‌ప్పు చేయ‌డంతోనే ఆమెపై లేనిపోని వార్త‌లు, అపోహ‌లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆమె త‌న భ‌ర్త పేరు తొల‌గించినంత‌ మాత్రాన విడాకులు తీసుకుంద‌ని ఎలా ఫిక్స్ అవుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. శ్రీజ త‌న ఇష్ట ప్ర‌కార‌మే త‌న భ‌ర్త అనుమతితోనే భ‌ర్త పేరు తీసేసి త‌న ఇంటి పేరు మార్చుకుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి శ్రీజ మూడో పెళ్లికి మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని సమాచారం అందుతోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…