
నందమూరి తారకరత్న గత నాలుగు రోజుల క్రితం చనిపోయిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని మరియు మరియు కోట్లాది మంది నందమూరి అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.నిన్న ఆయన పుట్టినరోజు, సరిగ్గా నిన్నటితో ఆయన 40 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు.పెళ్ళాం పిల్లలు మరియు బంధుమిత్రులతో ఎంతో సంతోషం గా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన తారకరత్న ఇప్పుడు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం అనేది జీర్ణించుకోలేని విషయం.నిన్ననే ఆయన చిన్న కర్మ కూడా జరిగింది.ఈ కార్యక్రమం మొత్తాన్ని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి జరిపించాడు.ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో రోజుకి ఒకటి ప్రచారం అవుతుంది.రీసెంట్ గా ఆయన గురించి తెలిసిన మరో వార్త అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
అదేమిటంటే నందమూరి తారకరత్న కెరీర్ లో కమర్షియల్ గా సూపర్ హిట్ సాధించిన సినిమా ‘భద్రాద్రి రాముడు’.ఈ చిత్రం లోని పాటలు కూడా ఆరోజుల్లో సూపర్ హిట్ గా నిలిచాయి.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కుట్టి రాధికా కేవలం ఈ చిత్రం లో మాత్రమే నటించింది.తర్వాత ఈమె తెలుగులో నటించలేదు కానీ, కన్నడలో పెద్ద స్టార్ హీరోయిన్.అంటే కాదు ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కి భార్య కూడా.’భద్రాద్రి రాముడు’ సినిమా సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు రూమర్స్ వినిపించేవట.ఆ రూమర్స్ చివరికి నిజం అయ్యాయి.కుమారస్వామి ని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధికా, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.అంతే కాదు ఆమె నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తుంది,భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం కూడా చెయ్యబోతుందట.
1)
2)
ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోకముందు తన చివరి కోరిక గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండీ అవుతుంది. t కొద్దీ నెలల క్రితం ఆయన కొన్ని ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు..ఈ ఇంటర్వూస్ లో అతని మాట తీరుని చూసి అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు..ఈ ఇంటర్వూస్ లో ఆయన ఎన్నో సందర్భాలలో బాలయ్య బాబు తో కలిసి నటించాలనేది నా కోరిక అంటూ చెప్పుకొస్తూ ఉండే వాడు,త్వరలో తెరకెక్కబోయ్యే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో కూడా తారకరత్న కి ఒక మంచి పాత్రకి ఎంపిక అయ్యాడట.ఈ నెలలనే షూటింగ్ ప్రారంభం కావాల్సింది, ఈలోపే ఈ ఘోరం జరిగిపోయింది.