
అభిమానులు తాము ఆరాధ్య దైవంగా భావించే హీరోలకు హీరోయిన్లకు గుడి కట్టడం లాంటి సందర్భాలు మనం తమిళ్ నాడు లో ఎన్నో చూసాము.అక్కడ వాళ్ళు ఎక్కువగా హీరోయిన్లకు గుడి కట్టారు.కుష్బూ ,నగ్మా ,నమిత మరియు హన్సిక వంటి హీరోయిన్లకు గుడులు కట్టారు.ఇదేమి పిచ్చి రా బాబు వీళ్ళకి అని మనం అందరం అనుకున్నాము.కానీ ఆ సంప్రదాయం ఇప్పుడు మన తెలుగు నాట కూడా మెల్లిగా పాకుతుంది.గతం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విగ్రహాలు తాడేపల్లిగూడెం లో మనం చూసాము.తర్వాత ఆయన అభిమానులు వైజాగ్ ప్రాంతం లో కూడా గుడి కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి కూడా గుడి కట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అది ఎక్కడో ఏమిటో ఇప్పుడు మనం తెల్సుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజాంపాలెం వైసీపీ నాయకులు సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట గుడి కట్టిస్తున్నారు.దానికి గోపాలపురం ఎం ఎల్ ఏ తలరి వెంక్రట్రావు శంకుస్థాపన చేసారు.సుమారు 3 కోట్ల రూపాయిల వ్యయం తో కడుతున్న ఈ గుడి ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిజైన్ చేసినట్టు సమాచారం.దీనికి సంబందించి ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారాయి.ఈ నెలలో ప్రారంబించి డిసెంబర్ నాటికి ఈ గుడి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు అట.అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి కూడా ఇలాగె గుడి కట్టి తమ ఎనలేని అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ ప్రజలు.ఇప్పుడు జగన్ కి కూడా అదే విధంగా గుడి కట్టడం చర్చనీయాంశంగా మారింది.సుమారు మూడు ఏళ్ళు పాదయాత్ర చేసి జనాల కష్టాలను చూసి చలించిపోయిన జగన్ వారికి ఇచ్చిన ప్రతి మాటను ముఖ్య మంత్రి అయినా తర్వాత నెరవేరుస్తు పోతున్నాడు కాబట్టే ఆయనకి జనాలు ఈ స్థాయిలో నీరాజనాలు పలుకుతున్నారు అని చెప్పొచ్చు.
ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రోజు రోజు కి కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టెస్టుల విషయం లో దేశం లోనే అగ్ర స్థానం లో నిలబడి ఉన్న మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ,కరోనా నియంత్రణ విషయం లో కూడా అదే స్థాయిలో చర్యలు చేపడుతుంది.ముఖ్యం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా చేయనున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి కరోనా ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చెయ్యనున్నాము అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.ఒక్క కరోనా పేషెంట్ కి రోజుకి సగటున 25 వేల రూపాయిలు ఖర్చు అవుతుంది.ఆలా కరోనా పేషెంట్ ఎన్ని రోజులు అయితే ఆసుపత్రి లో ఉంటాడో అన్ని రోజులు వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.ఇలా చెయ్యడం వల్ల కరోనా కి ట్రీట్మెంట్ చేయించుకోలేని నిరుపేద కుటుంబాలు అన్ని లబ్ది పొందనున్నాయి.జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి గొప్ప పనులు చేస్తూ పోతే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి జిల్లాళ్ళలోనూ ఆయన గుడి వెలుస్తుంది ఏమో