
టాలీవుడ్ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశాడు. ఈ ఘటన సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఎందరో అగ్రహీరోలతో కలిసి నటించిన మీనాకు రియల్ లైఫ్‌లో పెద్ద కష్టం రావడంతో అందరూ చలించిపోయారు. అయితే మీనా భర్త బర్డ్ ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడన్న వార్తలు కలకలం సృష్టించాయి. మీనా భర్త అంత్యక్రియలు కూడా జరగకముందే ఈ వార్తలు హల్‌చల్ చేయడంతో మీనా మానసికంగా క్రుంగిపోయింది. తన భర్త అంత్యక్రియలు మీనా స్వయంగా నిర్వహించి ఛితాబస్మాన్ని ఇంటికి తీసుకువెళ్లిన కాసేపటికే ఆమెకు పోలీసులు షాక్ ఇచ్చారు. మీడియాలో బర్డ్ ఇన్ఫెక్షన్ కారణంగానే విద్యాసాగర్ చనిపోయాడని ప్రచారం జరగడంతో దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వివరాలు తెలుసుకుందామని వాళ్లు మీనా ఇంటికి వెళ్లారు.
చాలా మంది పావురాలను చూసి ముచ్చట పడుతుంటారు. అయితే చెన్నైలోని మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని.. వాటి వల్లే ఇన్‌ఫెక్షన్‌కు గురై విద్యాసాగర్ అనారోగ్యం పాలయ్యారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. పావురాల వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరించారు. ప్రధానంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు వెంటనే సోకే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. సాధారణంగా ఏసీ మెకానిక్‌లు ఎక్కువగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతుంటారు. దీనికి కూడా కారణం పావురాలేనని నిపుణులు చెబుతున్నారు. విద్యాసాగర్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నాక శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డారని ఆయన కుటుంబ సన్నిహితులు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మీనా ఇంటి సమీపంలో బర్డ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతున్న వ్యర్థాలు తొలగించాలనే చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమైనట్లు మీనాకు పోలీసులు వివరించారు.
కాగా తన భర్త విద్యాసాగర్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై మీనా విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నామని.. ఈ సమయంలో తమ కుటుంబం ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన భర్త అంత్యక్రియలు మీనా స్వయంగా నిర్వహించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మీనా సినిమాల్లో నటించడానికి ఆమె భర్త ఎంతో సహకరించేవారని.. పెళ్లి తర్వాత తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎంతో ప్రేమగా చూసుకునేవారని.. అందుకే ఆయన ఆత్మకు శాంతి కలగడానికి మీనానే అంత్యక్రియలు నిర్వహించారని కథనాలు వెలువడ్డాయి. కాగా మీనా, విద్యాసాగర్ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది. మీనా కూతురు కూడా సినిమాల్లో నటిస్తోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా కూతురు నైనిక నటించింది.