
గత వారం రోజుల నుండి మన టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు ఎలాంటి దుమారం ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ ఎన్నికలలో జరిగినంత గొడవలు అయిదేళ్లకి ఒక్కసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా జరగలేదు అనేది వాస్తవం, ప్రతి రోజు అటు మంచు విష్ణు ఇటు ప్రకాష్ రాజ్ ఎదో ఒక్క ఆరోపణలు చేసుకుంటూనే ఉండేవారు, పట్టుమని 900 ఓట్లు కూడా లేని ఈ చిన్న ఎన్నికల కోసం ఈ స్థాయిలో తిట్టుకోవాలా అని ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వంటి వారు కూడా పెదవి విరిచారు, ఎట్టకేలకు ఇన్ని రోజుల ఈ మా ఎన్నికల వివాదానికి ఈరోజుటితో తెరపడింది, హోరాహోరీగా ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ఈరోజు మా ఎన్నికలలో తలపడ్డారు , ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది, ఇక ఈ పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వంటి వారు ఈరోజు తెల్లవారు జామున తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత మీడియా తో మాట్లాడుతూ ‘మా ఎన్నికలు అప్పుడు గొడవలు జరుగుతూ ఉండే వాతావరణం సహజమే,మనం ఆ పరిస్థితి ని ఎదురుకోక తప్పదు,కానీ ఈసారి హద్దులు దాటి మరి విమర్శలు చేసుకున్నారు, ఇక నుండి అలాంటి పరిస్థితి రాకుండ ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటాము’ అంటూ చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు, ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు,రామ్ చరణ్ మంచు విసిహెను మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ఎందుకు అయ్యా నీకు ఈ గొడవలు అని రామ్ చరణ్ అనడం, కొన్ని కొన్ని సార్లు తప్పవు బ్రదర్ అని మంచు విష్ణు మాట్లాడడం అంటూ ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఈరోజు మీడియా లో తెగ వైరల్ అయ్యింది.
ఇక ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ తొలిసారి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కుని అందరి కంటే ముందుగానే
వినియోగించుకున్నాడు,అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘ నేను ఇంతకాలం మా ఎన్నికలు ఇంత వాడివేడిగా ఉండడం ఎప్పుడు చూడలేదు,పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన సినిమా హీరోలే ఇలా గొడవలు పాడడం నాకు కాస్త బాహీగా అనిపించింది, మోహన్ బాబు గారు మరియు చిరంజీవి గారు మంచి మిత్రులు , వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, సినిమా ఇండస్ట్రీ ని రెండు గ్రూప్స్ గా విభజించడం ఎవరి తరం కాదు, మేము అందరం ఎప్పటికి ఒక్కే కుటుంబం ‘ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు, ఇక పోలింగ్ బూత్ వద్ద ఉన్న ప్రకాష్ రాజ్ మరియు మంచు మనోజ్ లతో పవన్ కళ్యాణ్ కాసేపు సరదాగా ముచ్చటించారు, మంచు మనోజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం ని చూస్తే వాళ్లిదరు ఎంత క్లోజ్ గా ఉన్నారో అర్థం అవుతుంది.