Home Entertainment మా ఎన్నికల పై కోట శ్రీనివాస రావు గారు చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

మా ఎన్నికల పై కోట శ్రీనివాస రావు గారు చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
191

టాలీవుడ్ లో నేడు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, జాతీయ స్థాయి నటుడిగా కొనసాగుతున్న ప్రకాష్ రాజ్ మరియు మన టాలీవుడ్ లో అతి పెద్ద కుటుంబాలలో ఒక్కటి అయినా మంచు కుటుంబం నుండి మంచు విష్ణు వర్ధన్ బాబు ప్రెసిడెంట్ ఎన్నికలలో నిలబడడం వల్ల తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడింది, ప్రతి ఏడాది ఈ ఎన్నికలు హోరాహోరీగా ఉండే విషయం మన అందరికి తెలిసిందే, ఈసారి ఈ ఎన్నికలు వేరే స్థాయికి వెళ్లడం తో ఎవరు గెలుస్తారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది, ఇక ఒక్క పక్క మంచు విష్ణు మరో పక్క ప్రకాష్ రాజ్ ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటూ ఛలోక్తులు విసురుకుంటూ ఉన్నారు,ఇక ఈ ఎన్నికలు ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుంది అంటే మెగా ఫామిలీ వర్సెస్ టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలు లెక్క మారిపోయింది, చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలపగా, మంచు విష్ణు వర్ధన్ బాబు కి నందమూరి కుటుంబం, ఘట్టమేని కుటుంబం మరియు రెబెల్ స్టార్ కుటుంబం సపోర్టుగా నిలిచాయి,ముఖ్యంగా ఈ ఎన్నికలలో లోకల్ మరియు నాన్ లోకల్ సెంటిమెంట్ ని లేవగొట్టారు ,ఈ సెంటిమెంట్ ఎవరికీ పాజిటివ్ గా మారనుంది అనే విషయం తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

ఇక కొంతమంది సినీ నటులు బహిరంగంగానే ప్రకాష్ రాజ్ కి మరియు మంచు విష్ణు కి సపోర్టు చేస్తున్నారు, వారిలో ఒక్కరు కోట శ్రీనివాస రావు గారు, ఇండస్ట్రీ లో కోట శ్రీనివాస రావు గారికి ఉన్న పేరు ప్రతిష్ట ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎన్నో వందల సినిమాల్లో అద్భుతంగా నటించి నటనలో తనకి సాటి మరెవ్వరు లేరు అని నిరూపించుకున్నాడు, అలాంటి మహా నటుడు ఇటీవల ప్రకాష్ రాజ్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘ ప్రకాష్ రాజ్ నేను జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నటుడుకిని అని చెప్పుకుంటూ ఉన్నాడు, ఆయనలాగా నేను డబ్బాలు కొట్టుకొను కానీ మీ అందరికి ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్న, నేను ప్రకాష్ రాజ్ తో కలిసి దాదాపు 15 సినిమాల్లో మెయిన్ రోల్స్ వేసాను,ఒక్క రోజు కూడా ఆయన షూటింగ్ కి సరైన సమయం లో రాలేదు, ఇలాంటోళ్ళకి ఓట్లు వేసి ఎందుకు మన నెత్తి మీద పెట్టుకోవడం, మన తెలుగు వాడైనా మంచు విష్ణు కి అందరికి ఓటు వెయ్యండి’ అంటూ కోట శ్రీనివాస రావై చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సషనల్ గా మారింది.

ఇక ఇటీవల మంచు విష్ణు మీడియా ముందుకి వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇతనికి మతి స్థిమితం బాగానే ఉండ అని అనిపిస్తుంది,సోషల్ మీడియా లో అయితే నెటిజెన్లు ఆయన మాటలకు పగలబడిమరీ నవ్వుకుంటున్నారు,ఇక మంచు విష్ణు తీరు మరియు ప్రవర్తన పై ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘మాటికొస్తే ప్రెస్ మీట్ లు పెట్టి పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు,ఇవేమైనా దేశ రాజకీయాలా?,తిప్పి కొడితే వెయ్యిమంది ఓట్లు కూడా లేని చిన్న వ్యవస్థ, దీనికి ఈ స్థాయి హడావుడి చెయ్యడం ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు, ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అనే ముద్ర వెయ్యాలని చూస్తున్నారు, ఆయన భారత దేశానికీ సంబంధించిన నటుడు రా బాబు, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి మా ప్రెసిడెంట్ గా ఉంటే మా కి ఒక్క అలంకారం లాంటిది, ఏదైనా సమస్య వస్తే ప్రధాన మంత్రి తో కూడా పోరాడి పరిష్కరించుకునే సత్తా ఉన్న వ్యక్తి అతను, అతనికి మీకు పోలిక ఏంటి’ అంటూ నాగబాబు మంచు విష్ణు పై కామెంట్స్ చేసాడు, దీనికి మంచు విష్ణు మోడీ అంకూల్ తో నాకు గోళీలు ఆడుకునేంత చనువు ఉంది అంటూ నాగబాబు మాటలకు సమాధానం ఇచ్చి మరో సారి కమెడియన్ అయిపోయాడు మంచు విష్ణు, మరి హోరాహోరీగా సాగుతున్న ఈ బీభత్సమైన పోరు లో ఎవరు గెలవబోతున్నారో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…