
భింబిసారా మరియు సీతారామం వంటి సెన్సషనల్ బాక్ బస్టర్ హిట్స్ తో పూర్వ వైభవం లోకి వచ్చిన టాలీవుడ్ అదే జోష్ ని ముందు కూడా ఇక కొనసాగిస్తుంది అని అనుకున్నారు..చాలా కాలం తర్వాత వస్తున్నా మాస్ కమర్షియల్ సినిమా కావడం తో యంగ్ హీరో నితిన్ నటించిన మాచెర్ల నియోజకవర్గం మీద ట్రేడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..టీజర్ ట్రైలర్ మరియు పాటలు కూడా ఈ సినిమా పై పేక్షకులలో మరియు అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది..సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే వైబ్రేషన్స్ ని తీసుకొచ్చింది..కానీ తీరా చూస్తే ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చేసింది..బహుశా భింబిసారా మరియు సీతారామం వంటి డిఫరెంట్ సినిమాలను చూసిన తర్వాత వెంటనే రొటీన్ కమర్షియల్ సినిమా చూడడం తో జనాలు కాస్త తీసుకోలేకపోయి ఉండొచ్చు..అందుకే ఈ టాక్ వచ్చి ఉండొచ్చు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
కానీ నితిన్ సినిమాలకు టాక్ ఉన్నా లేకపోయినా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయి..ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ కూడా టాక్ కి కలెక్షన్స్ కి అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చాయి..అద్భుతమైన వసూళ్లు రాబట్టి మొదటి రోజే 25 శాతం రికవరీ రేట్ ని అందుకుంది..ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది చూస్తే నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా 1 కోటి 70 లక్షల రూపాయిల షేర్ వచ్చింది..ఇది నితిన్ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు కాకపోయినప్పటికీ టాక్ ని బట్టి చూస్తే మంచి ఓపెనింగ్ వచ్చింది అనే చెప్పాలి..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ అదుర్స్..ఈ ప్రాంతం లో ఇక్కడ మొదటి రోజు 80 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నది..టాక్ పెద్దగా రాకపోయినా ఈ స్థాయి వసూళ్లు అంటే అది నితిన్ బాక్స్ ఆఫీస్ స్టామినా అని చెప్పొచ్చు.
ఇక సీడెడ్ , నెల్లూరు, గుంటూరు మరియు కృష్ణ జిల్లాలలో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..సీడెడ్ ప్రాంతం లో ఈ సినిమా 60 నుండి 70 లక్షల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉంది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు 4 నుండి 5 కోట్ల రూపాయిల మధ్యలో ఉండే అవకాశం ఉంది..ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రం గానే ఉంది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ప్రాంతాలకు కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఫ్లాప్ టాక్ తో ఈ స్థాయి వసూళ్లు అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది..వరుసగా సెలవులు రావడం తో ఈ సినిమా ఈ నాలుగు రోజులు బాగా ఆడితే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి..మరి చూడాలి హాలిడేస్ ని ఉపయోగించుకుంటుందా లేదా అనేది.