Home Entertainment మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

2 second read
0
0
8,837

సరిలేరు నీకెవ్వరూ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత మహేష్ బాబు సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తీసుకొని చేసిన చిత్రం సర్కారు వారి పాట..గీత గోవిందం వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..పైగా మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఒక్క పూర్తి స్థాయి వినోదభరిత సినిమా చెయ్యడం తో కచ్చితంగా ఇది దూకుడు స్థాయి సెన్సషనల్ హిట్ అవ్వుధి అని అభిమానుల్లో గట్టి నమ్మకం ఉన్నది..ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ఇటీవల ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు, టీజర్ మరియు ట్రైలర్ వంటివి అభిమానులను ఉర్రూతలూ ఊగించేలా చేసింది..ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా సెన్సషనల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

 

అదేమిటి అంటే ఈ సినిమాని చూసిన అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతారు అట..పోకిరి లో పండుగాడు క్యారక్టర్ మనం అంత తేలికగా మరచిపోలేము..సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నంతకాలం ఆ మాస్ క్యారక్టర్ మన మదిలో చిరస్థాయిగా గుర్తు ఉండిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటి క్యారక్టర్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ని మలిచాడు అట డైరెక్టర్ పరశురామ్ పెట్ల..ఒక్క మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తుంది అట..పోకిరి లాంటి మాస్ , మరియు దూకుడు లాంటి కామెడీ టైమింగ్ మరియు శ్రీమంతుడు లాంటి సందేశం తో ఈ సినిమాని అల్ టైం ఇండస్ట్రీ కొట్టే రేంజ్ లో పరశురామ్ పెట్ల ఔట్పుట్ ని రాబట్టాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ అభిమనులకు మాస్ ఫెస్టివల్ అని తెలుస్తుంది.సోమవారం నాడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియనున్నాయి.

 

ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోయ్యే సినిమాలో నటించబోతున్నాడు..ఖలేజా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..ఈ సినిమా తర్వాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయ్యే సినిమాలో నటిస్తున్నాడు..వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు మాత్రమే కాదు,తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది..ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ వినడానికి ఇటీవలే మహేష్ మరియు రాజమౌళి దుబాయి కి వెళ్లారు..రాజమౌళి తన స్టోరీ సిట్టింగ్స్ అన్ని దుబాయిలోనే వేస్తాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..అంటే కాకుండా తన హీరోలకు సంబంధించిన లుక్ టెస్ట్స్ కూడా అక్కడ వర్క్ షాప్ లో చేస్తూ ఉంటాడు రాజమౌళి..మహేష్ బాబు కి కూడా లుక్ టెస్ట్ చెయ్యనున్నారు అని తెలుస్తుంది…ఈ ఏడాది లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట రాజమౌళి.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…