
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. పవర్ స్టార్‌కు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ఆయన తనయుడు అకీరాకు కూడా అంతే క్రేజ్ ఉంది. తండ్రి తరహాలోనే అతడికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే అకీరా గురించి న్యూస్ రాగానే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అకీరా నందన్ టాలెంట్ గురించి పవన్ అభిమానులకు తెలిసిందే. అకీరా వెండితెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవర్ స్టార్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా చేసిన పనికి సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఫిదా అయ్యాడు. సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాటకు అకీరా మ్యూజిక్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. తనలోని మరో టాలెంట్‌ను అకీరా బయటపెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులతో పాటు సూపర్ స్టార్ అభిమానుల మనసులను కూడా దోచుకున్నాడు.
వపన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రస్తుతం ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా కాలేజ్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకల్లో పవర్ స్టార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పవన్‌తో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. అనంతరం స్కూల్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన వేడుకల్లో మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటను తన పియానో మీద వాయించడంతో సూపర్ స్టార్ అభిమానులు థ్రిల్ అయ్యారు. అకీరా ఇప్పటికే ఈయన సిల్వర్ స్క్రీన్ మీద తల్లి రేణు దేశాయ్ డైరెక్ట్ చేసిన ఇష్క్ వాలా లవ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఇది ఒక మరాఠి సినిమా. అయితే ప్రస్తుతం సినిమాల విషయం పక్కన పెట్టి అతడు చదువు పైనే శ్రద్ధ పెట్టాడు.
గతంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా తన కుమారుడిని మ్యూజిక్ క్లాసులకు సైతం తీసుకు వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా కళావతి పాటకు మ్యూజిక్ ప్లే చేసి టాలెంట్ ఉన్న కీబోర్డ్ ప్లేయర్ అని అకీరా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ పాటకు అకీరా టాలెంట్ చూసి కొందరు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు జూనియర్ తమన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అకీరాకు మార్షల్ ఆర్ట్స్ అంటే కూడా ఇష్టమే. అలాగే అతడు జంతు ప్రేమికుడు. జంతువుల కోసం చాలా సేవ చేస్తున్నాడు. కరోనా వైరస్ కాలంలో నాలుగు ఆక్సిజన్ సిలిండర్స్‌ను హాస్పిటల్‌కు అందజేశారు. మానవసేవే మాధవసేవ అని అకీరా నమ్ముతున్నాడని స్కూల్ యాజమాన్యం గ్రాడ్యుయేషన్ వేడుకల్లో స్పెషల్‌గా ఎనౌన్స్ చేయడం పట్ల పవన్ స్టార్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.