
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మకుటంలేని మహారాజు..తెలుగు సినిమా స్థాయిని వాణిజ్య పరంగా, సాంకేతికపరంగా వేరే స్థాయికి తీసుకెళ్లిన మహా మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటీవలే మరణించిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని, లక్షలాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి మనకి తెలిసిందే..అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనని ఆధారంగా చేసుకొని సోషల్ మీడియా లో అనేక వార్తలు వచ్చాయి..అవేమిటి అంటే కృష్ణ గారు నరేష్ కి ఎలాంటి ఆస్తులు పంచలేదని..అతని ఆస్తులు మహేష్ కి మరియు మనవాళ్లకు చెందేవిధంగా మాత్రమే వీలునామా రాసాడని..ఇలా సోషల్ మీడియా లో అనేక రకమైన వార్తలు వినిపించాయి..అయితే తన పై ఎప్పుడు వచ్చే రూమర్స్ కి వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చే నరేష్..ఈ ప్రచారాలపై కూడా ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు..ఆయన చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘కృష్ణ గారికి నేను సొంత కొడుకు కాకపోయినా, మొదటి నుండి నన్ను ఆయన సొంత కొడుకులాగానే సమానంగా చూసుకున్నారు..ఏరోజు కూడా ఆయన నాకు ఎలాంటి లోటు రానివ్వలేదు..కృష్ణ గారి చివరి రోజులన్నీ నా దగ్గరే గడిచాయి..ఆయన నాకు దేవుడు లాంటి వాడు..ఇవ్వాల్సినవని అడక్కుండానే ఇచ్చిన మహామనిషి ఆయన..అలాంటి మనిషి నుండి నేను ఏమి ఆశిస్తాను..ఆయన ఆశీర్వాదం తప్ప..కృష్ణ గారు అసలు ఆస్తుల గురించి ఎప్పుడు పట్టించుకోరు..ఆయనకంటూ ఏమి మిగిలించుకోలేదు కూడా..సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ఈ వార్తలను చూస్తూనే ఉన్నాను..చాలా విసుగొచ్చింది..ఒక కుటుంబం మొత్తం బాధలో ఉన్న సమయం లో కూడా ఇలాంటి వార్తలు పుట్టించి డబ్బులు చేసుకోవాలనుకోవడం అమానుషం’ అంటూ నరేష్ ఈ సందర్భంగా మాట్లాడారు..అంతే కాకుండా కృష్ణ గారి అస్తికలు విజయవాడ లో కలపడం గురించి మహేష్ బాబు కి మరియు నరేష్ కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని..అందుకే నరేష్ కృష్ణ గారి అస్థికలను కలిపే కార్యక్రమానికి హాజరు కాలేదని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
అయితే ఈ కామెంట్స్ పై ఘట్టమనేని కుటుంబం ఫాన్స్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..నరేష్ కృష్ణ గారి కుమారుడు కాదు..అస్తికలు కార్యక్రమానికి నరేష్ హాజరు అవ్వాల్సిన అవసరం లేదు..నరేష్ గారి తల్లి విజయ నిర్మల గారు చనిపోయినప్పుడు ఆమె అస్థికలను కలిపే కార్యక్రమానికి మహేష్ బాబు వచ్చాడా..లేదు కదా..ఎందుకు ప్రతి దానిని భూతద్దం లో చూస్తారు అని సోషల్ మీడియా లో గాసిప్ రాయుళ్ల పై విరుచుకుపడ్డారు..మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కుటుంబం కృష్ణ గారి మరణాన్ని జీర్ణించుకోలేక శోకసంద్రం లో మునిగిపోయి ఉంటె ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపాల్సింది పోయి ఇలాంటి వార్తలను ప్రచురితం చేస్తారా అంటే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాల్సి ఉండగా అది కృష్ణ గారి మరణం వల్ల ప్రారంభం అవ్వడానికి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.