Home Entertainment మహేష్ బాబు కూతురుగా ‘అల్లు అర్హ’..త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది

మహేష్ బాబు కూతురుగా ‘అల్లు అర్హ’..త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది

0 second read
0
0
737

సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. గతంలో అతడు, ఖలేజా వంటి సినిమాలు వీళ్ల కాంబోలో వచ్చి సూపర్ హిట్ సాధించాయి. ఇప్పటికీ అతడు, ఖలేజా సినిమాలు టీవీలలో ప్రసారం అవుతుంటే మంచి టీఆర్పీలు నమోదవుతుంటాయి. తాజాగా మూడో సినిమా కూడా హ్యాట్రిక్ కొడుతుందని సూపర్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. అసలే మహేష్ కుటుంబంలో గత ఏడాది రెండు విషాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నూతన ఏడాది అతడికి కలిసి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో అనుకోని అతిథి నటిస్తుందని తెలిసి అటు సూపర్‌స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ అతిథి ఎవరో కాదు అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు.. అల వైకుంఠపురములో మూవీ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడినా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు కీలక పాత్రలో అల్లు అర్జున్ గారాల పట్టీ అల్లు అర్హ నటించబోతోందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అల్లు అర్హ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు రెండో మూవీలో నటించేందుకు కూడా బన్నీ ఫ్యామిలీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఇటీవల గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, బిజినెస్ మేన్ రవి రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బన్నీ, మహేష్ హాజరయ్యారు.

ఈ వేడుకలో మహేష్‌బాబు, అల్లు అర్జున్ పక్కపక్కనే కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో సూపర్‌స్టార్, బన్నీ అభిమానులు ఆశ్చర్యపోయారు. బన్నీ కూతురితో మహేష్ మాట్లాడి యోగక్షేమాల గురించి కనుక్కున్నారు. అల్లు అర్హతో మహేష్ ఆప్యాయంగా మాట్లాడారు. తన విలువైన సమయంలో కొంత సమయాన్ని అర్హ కోసం కేటాయించి మహేష్ తాను గ్రేట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అతడిపై ప్రశంసలు కురిపించారు. త్రివిక్రమ్ సినిమాలో మంచి పాత్ర ఉండటంతో అల్లు అర్హ కోసం సంప్రదించారని సమాచారం అందుతోంది. బన్నీ, త్రివిక్రమ్ సన్నిహితులు కావడంతో త్రివిక్రమ్ అడిగితే మహేష్ సినిమాలో అర్హ నటించడానికి బన్నీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తర్వాతే మహేష్ రాజమౌళి సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది జూలై తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…