
సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఈ ఏడాది ఎంత విచారకరమైనదో మాటల్లో చెప్పలేము..ఈ ఏడాది ప్రారంభం లో అన్నయ్య రమేష్ బాబు గారు మరణించడం..రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవి గారు మరణించడం..నిన్న తన ప్రాణానికి ప్రాణమైన తండ్రి గారు సూపర్ స్టార్ కృష్ణ మరణించడం..ఇలా ఒకే ఏడాది లో కుటుంబం లో ముగ్గురు ముఖ్యమైన మనసుకి దగ్గరైనోళ్లు తనని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మహేష్ బాబు గారిని ఎలాంటి మానసిక సంక్షోభానికి గురి చేసిందో ఊహించుకోవచ్చు..మహేష్ బాబు కి ఎదురైనా ఈ విచారకమైన సందర్భం మన జీవితాల్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి..ఇలాంటి సందర్భం లో ఎవరైనా ధైర్యం గా ఉంటూ తన తోటి కుటుంబ సబ్యులకు ధైర్యాన్ని పంచడం చాలా కష్టం..కానీ మహేష్ బాబు గారు ఇలాంటి విపత్కర సమయం లో కూడా తన మనోధైర్యాన్ని కోల్పోకుండా కుటుంబం లో కూడా ధైర్యాన్ని నింపడానికి చాలా ప్రయత్నమే చేసాడు కానీ తనవల్ల అవ్వలేదు.
నిన్నటి నుండి ఆయన ఏడుస్తూనే ఉన్నారు..దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారిని చూసిన వెంటనే మహేష్ బాబు హత్తుకొని చిన్నపిల్లవాడిలాగా ఏడ్చినా వీడియో ఇప్పటికి సోషల్ మీడియా లో ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందో మనకి తెలిసిందే..ఈ వీడియో ని చూసి అభిమానులు చాలా డిస్టర్బ్ అయ్యారు..అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ కృష్ణ గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు..అప్పటి వరుకు ఏడుపు మొహం తో ఉన్న మహేష్ బాబు ని ఆయన కలిసి ఓదార్చి ధైర్యం నింపారు..కాసేపు మహేష్ తో మరియు ఆయన కుటుంబం తో సంభాషణ జరిపిన తర్వాత మహేష్ మొహం లో నవ్వులు పూయించారు..మహేష్ బాబు ఇంత స్వచంగా నవ్వింది బాలయ్య బాబు కలిసిన తర్వాతే..మహేష్ బాబు తో పాటుగా ఆయన తనయుడు గౌతమ్ బాబు కూడా నవ్వడం మనం క్రింద ఫోటో లో చూడవచ్చు..కృష్ణ గారి కుటుంబం తో నందమూరి ఫామిలీ కి ఉన్న సంబంధం ఎంతో గొప్పది.
కృష్ణ గారితో కలిసి బాలయ్య బాబు గతం లో సుల్తాన్ అనే మల్టీస్టార్ర్ర్ సినిమా చేసాడు..ఈ సినిమాలో కృష్ణ , బాలయ్య బాబు తో పాటుగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు కూడా నటించారు..ఆ తర్వాత బాలయ్య బాబు తో కృష్ణ కాంబినేషన్ రాకపోయినప్పటికీ కూడా ఇరువురి హీరోల అభిమానులకు ఈ సినిమా ఒక తీపి జ్ఞాపకం లాగ మిగిలిపోయింది..ఈరోజు కృష్ణ గారి భౌతిక కాయాన్ని సందర్శించిన తర్వాత సుమారు 7 నిమిషాల పాటు కృష్ణ గారి గొప్పతనం గురించి..మరియు ఆయనతో తనకి ఉన్న అనుబంధం గురించి బాలయ్య బాబు చెప్పుకొచ్చారు..ఆయన మాట్లాడుతూ ‘కృష్ణ గారి లాంటి మహోన్నత మనిషి మళ్ళీ జన్మించడం కష్టం..నాన్న గారిలాగానే ఆయన కూడా ఒక కారణజన్ములు..తెలుగు సినీ కళామ్మతల్లి కి ఆయన అంధించిన సేవలు చిరస్మరణీయం..రెండు నెలల క్రితమే కృష్ణ గారితో కలిసి భోజనం చేశాను..కానీ ఇప్పుడు ఆయనని ఇలాంటి పరిస్థితి లో చూస్తానని ఊహించలేదు’ అంటూ బాలయ్య బాబు చాలా బావోదేవగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.