
మహేష్ బాబు సినిమా వచ్చి రెండు ఏళ్ళు అయ్యింది, 2020 సంక్రాతి కానుకగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకు ఎక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విష్యం తెలిసిందే. ఈ సినిమా తరువాత మహేష్ బాబు కి బారి గ్యాప్ వచ్చింది. ఈ సినిమా అనంతరం దర్శకుడు వంశి పైడిపల్లి తో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది. దాదాపు సెట్స్ పైకి వెళ్లాల్సిన సమయానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడ్డింది. మహేష్ బాబు వంశి చెప్పిన స్క్రిప్టులో మార్పులు కోరారు అని దాని కోసం ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు కి నిర్మాతలకు రెమ్యూనిరేషన్ విష్యం లో సర్రిగా కుదరకపోవడం తో ప్రాజెక్ట్ ఆగిపోయిందని మరో ప్రచారం జరుగుతుంది. వంశి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా కొన్నాళ్ళకు దర్శకుడు పరుశురాం తో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ప్రకటించారు.
కోవిద్ పరిస్తుతుల కారణం గా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యం కావడం జరిగింది మరో రెండు నెలలు సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ పడుతుంది అంటూ సమాచారం అందుతుంది, మహేష్ బాబు ఒక సర్జరీ చేపించుకోవాల్సి ఉంటుండగా సర్కారు వారి పాట తరువాత షెడ్యూల్ రెండు నెలల తరువాత అంటున్నారు చాలా కాలం గా మహేష్ బాబు మోకాలు సమస్యతో బాధపడుతున్నాడు నవ్వడం ఇబ్బంది అవుతుంది కారణం గా డాక్టర్స్ సర్జరీ చేయలని వైద్యులు సూసించారు దీనితో మహేష్ బాబు మోకాలు సర్జరీ కి సిద్ధం అయ్యాడు, సర్జరీ అనంతరం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూసించడం తో కొన్ని రోజుల పాటు మహేష్ బాబు షూటింగ్ కి హజ్జరు అయ్యే అవకాశం లేదని అంటున్నారు అయితే సర్కారు వారి పాట సినిమా విడుదల పై దీని ప్రభావం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
సంక్రాతి బరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వేసవి కి షిఫ్ట్ అయ్యింది, ఏప్రిల్ 1న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక దర్శకుడు పరుశురాం బ్యాంకాంగ్ మోసాలు, స్కామ్స్ వంటి ఆర్థిక నేరాల నేపథ్యం లో సర్కారు వారి పాట సినిమాని తెరకు ఎక్కిస్తున్నట్లు సమాచారం. మహేష్ రెండు విభిన్న మైన పాత్రలో కనిపిస్తారు అని తెలుస్తుంది, ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్. కియారా అద్వానీ మరియు సాయి మంజ్రేకర్‌లను మొదట కథానాయికగా పరిగణించారు కానీ చివరికి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది, ఇక వెన్నెల కిషోర్ మరియు సుబ్బరాజు ఈ సినిమాలో నటిస్తున్నారు ఇక తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు అని సమాచారం.
మహేష్ బాబు గత కొన్ని రోజులుగా మోకాలి గాయంతో బాధపడుతున్నానని, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నపాటి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని, మహేష్ బాబు సర్జరీ చేయించుకునేందుకు అమెరికా కి వెళ్లనున్నాడని సమాచారం అది పూర్తయక్క ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఇక రెండు నెలల గ్యాప్ తరువాత సర్కారు వారి పాట షూటింగ్ పూర్తిచేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా తరువాత మొదటిసారిగా లెజెండ్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నారు అని సమాచారం, ఈ సినిమా గురించి ఓఫిషల్ ప్రకటన రావాల్సి ఉంది, ఇక మహేష్ బాబు అభిమానులు ఈ సర్జరీ విష్యం తెలిసాక ఆందోళన చెందుతున్నారు మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ విష్యం ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.\