
వరుస విజయాలతో మంచి ఊపు మీద సూపర్ స్టార్ మహేష్ బాబు తన తడువారి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయి లో ఉన్నాయి..అతడు మరియు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ కూడా అవి కల్ట్ క్లాసిక్స్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది..టీవీలలో ఇప్పటికి కూడా ఈ సినిమాలు వస్తే ప్రేక్షకులు అతుక్కుపొయ్యి చూస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్నా సినిమా కాబట్టే ఇన్ని అంచనాలు ఏర్పడ్డాయి..పైగా త్రివిక్రమ్ ఇప్పుడు అరవింద సామెత,అలా వైకుంఠపురం లో మరియు భీమ్లా నాయక్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు..త్రివిక్రమ్ ఫామ్ కి తగట్టుగా మహేష్ బాబు కి కూడా మరో సంచలనమైన సినిమా ఇస్తాడు అనే నమ్మకం తో ఉన్నారు అభిమానులు.
ఇక ఈ ప్రాజెక్ట్ ని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అట..ముఖ్యంగా కాస్టింగ్ విషయం లో ‘తగ్గేదెలా’ అనే ధోరణి తో ముందుకు పోతున్నాడు..రెండు మూడు రోజుల క్రితమే ఈ సినిమాలో మహేష్ బాబు కి తమ్ముడిగా ఒక్క యువ హీరో నటించబోతున్నాడు..ఈ పాత్ర కోసం హీరో నాని ని కూడా సంప్రదించారు..కానీ ఆయన ఒప్పుకోలేదు అనే వార్తలు బయటకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన ఒప్పుకోకపొయ్యేసరికి ఈ పాత్ర కోసం మరో యువ హీరో శర్వానంద్ ని సంప్రదించినట్టు కూడా వార్తలు వచ్చాయి..ఫిలిం నగర్ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక్క యువ హీరో నటించేంత స్కోప్ అయితే కచితంగానే ఉంది అట..అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కూడా యువ హీరోనే తీసుకునేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు అట..ఈ ప్రయత్నం లో భాగంగానే నందమూరి హీరో తారక రత్న ని ఈ సినిమాలో విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.
తారక రత్న చాలా సినిమాల్లో హీరో గా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఆయన దురదృష్టం కొద్దీ ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేదు..దీనితో క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ లో కొన్ని సినిమాల్లో మెరిశాడు..ముఖ్యంగా అమరావతి అనే సినిమాలో ఇతను పోషించిన నెగటివ్ క్యారక్టర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈయనకి ఆశించిన స్థాయి లో బ్రేక్ దొరకలేదు..ఇలాంటి సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు వంటి క్రేజీ కాంబినేషన్ మూవీ ఛాన్స్ దక్కడం అంటే నిజంగా ఆయన మూడవ ఇన్నింగ్స్ భారీ లెవెల్ లో ప్రారంభం అయినట్టే అని చెప్పాలి..చూడాలి మరి తారక రత్న కెరీర్ ఇక నుండి ఎలా ఉంటుంది అనేది..ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బయటకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని పెట్టడానికి పరిశీలిస్తున్నారు అట.