
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఖుషి సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పవన్ ఏడో సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచనాలు క్రియేట్ చేసింది. 21 సంవత్సరాల కిందట తెలుగు ప్రజలను ఒక ఊపు ఊపింది. ఏఎమ్ రత్నం నిర్మాతగా శ్రీసూర్యా మూవీస్ పతాకంపై ఎస్ జే సూర్య ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీలో పవన్ సరసన భూమిక హీరోయిన్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మణిశర్మ స్వరపరిచిన పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటాయి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, ప్రేమంటే సులువు కాదురా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ మూవీలోని పాటలు, మాటలు, పవన్ కళ్యాణ్ లుక్స్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి చిత్రాలను రిలీజ్ చేయగా.. ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఖుషి సినిమాను న్యూ ఇయర్ స్పెషల్ అంటూ డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతోన్నారు. దీంతో పవర్‌స్టార్ అభిమానుల్లో ఇప్పుడే సంబరాలు మొదలయ్యాయి. బుక్ మై షోలో ఈ సినిమా టిక్కెట్లను విడుదల చేయగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఖుషి సినిమా దెబ్బకు ఇటీవల భారీ ఎత్తున రిలీజైన అవతార్-2 సినిమా కూడా కుదేలవుతోంది. బుక్ మై షో ట్రెండింగ్‌లో ఖుషి సినిమా ఉండటంతో పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క ప్రకటనతో ఈ స్థాయిలో ఖుషి సినిమాకు క్రేజ్ నెలకొని ఉండటంతో మిగతా స్టార్ల ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. ఒకప్పుడు ఖుషి టికెట్ల కోసం ఎంతగా పడిగాపులో కాశారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశాలున్నాయి.
అయితే కేవలం ఈనెల 31వ తేదీ ఒక్క రోజు మాత్రమే ఖుషి సినిమాను ప్రదర్శించబోతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిని ఖుషీగా ఖుషి సినిమాతో స్వాగతం చెప్పేందుకు పవర్ స్టార్ అభిమానులు రెడీ అవుతున్నారు. ఖుషి సినిమా రీ రిలీజ్ గురించి దర్శకుడు ఎస్‌జే సూర్య కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. ఎన్ని తరాలు మారినా, లవ్ స్టోరీల్లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్, ఎప్పటికీ నిలిచిపోయే రొమాంటిక్ సినిమా ఖుషీ అంటూ చెప్పుకొచ్చాడు. మీ దగ్గరల్లోని థియేటర్‌లో డిసెంబర్ 31న ఖుషి సినిమా మ్యాజిక్‌ను మరోసారి అనుభూతి పొందండి అంటూ ఎస్ జే సూర్య సూచించాడు. ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఖుషి చిత్రాన్ని 4కే రిజల్యూషన్. 5.1 డాల్బీ సౌండ్‌తో మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాను కోలీవుడ్‌లో విజయ్, జ్యోతిక కాంబినేషన్‌లో తీశాడు. తెలుగులో పవన్ కళ్యాణ్‌తో తీశాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఖుషి సినిమా కోలీవుడ్‌లో మాత్రం అంతగా ఆడలేదు.